యాప్నగరం

బాలీవుడ్‌కి నిన్ను కోరి.. ఉమగా వరుణ్!

నాని, నివేద థామస్, అది ప్రధాన పాత్రల్లో వచ్చిన ‘నిన్ను కోరి’ సినిమా తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది.

TNN 7 Sep 2017, 12:41 pm
నాని, నివేద థామస్, అది ప్రధాన పాత్రల్లో వచ్చిన ‘నిన్ను కోరి’ సినిమా తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో డి.వి.వి.దానయ్య, కోన వెంకట్ సంయుక్తగా తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం వస్తున్న ప్రేమకథలకు విరుద్ధంగా కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. బాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన సంజయ్ లీలా భన్సాలీ బాలీవుడ్ ‘నిన్ను కోరి’ని తెరకెక్కించనున్నట్లు సమాచారం.
Samayam Telugu ninnu kori hindi remake varun dhawan may play nanis character
బాలీవుడ్‌కి నిన్ను కోరి.. ఉమగా వరుణ్!


‘నిన్ను కోరి’ సినిమా బాలీవుడ్ మూవీ ‘హమ్ దిల్ దే చుకే సనమ్’కు దగ్గరగా ఉందని విడుదల ముందు సంజయ్ చెవికి చేరిందట. ఈ విషయమై నిర్మాతలతో సంజయ్ మాట్లాడారట. అదేంలేదని కోన వెంకట్, దానయ్య వివరణ ఇచ్చారట. సినిమా విడుదలైన తరవాత సంజయ్ డౌట్ క్లియర్ అయిపోయింది. అంతేకాకుండా ‘నిన్ను కోరి’ ఆయనకు తెగ నచ్చేసిందట. అందుకే రీమేక్ హక్కుల విషయమై నిర్మాతలు కోన వెంకట్, డి.వి.వి.దానయ్యలతో చర్చలు జరుపుతున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. అయితే తెలుగులో నాని పోషించిన ఉమ పాత్రకు వరుణ్ ధావన్ అయితే కరెక్ట్‌గా సరిపోతారని సంజయ్ భావించారట. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.