యాప్నగరం

నిర్మలా కాన్వెంట్ ట్రైలర్ విడుదల

హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్‌ను కథానాయకుడిగా నటించిన నిర్మలా కాన్వెంట్ సినిమా ట్రైలర్ శనివారం విడుదలైంది.

TNN 2 Jul 2016, 7:47 pm
హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్‌ను కథానాయకుడిగా నటించిన నిర్మలా కాన్వెంట్ సినిమా ట్రైలర్ విడుదలైంది. అక్కినేని నాగార్జున సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని మ్యాట్రిక్స్‌ టీమ్‌ వర్క్స్‌, అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మించాయి. ఈ సినిమా ద్వారా జి.నాగకోటేశ్వరరావు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. జై చిరంజీవ, దూకుడు, రోబో చిత్రాల్లో బాలనటిగా నటించిన శ్రేయాశర్మ ఈ చిత్రంలో రోషన్‌ సరసన హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో నాగార్జున ఓ స్పెష‌ల్ రోల్ చేశారు. నాగార్జున రోల్ ఈ మూవీకి హైలెట్ గా నిలవనుందని తెలుస్తోంది. విడుదలకు సిద్ధం అవుతోన్న నిర్మ‌లా కాన్వెంట్ డిజిట‌ల్ ట్రైల‌ర్‌ను నాగార్జున ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేశారు. ‘ఫ్రెష్ ఫ్యూర్ ల‌వ్ స్టోరీ‌గా నిర్మ‌లా కాన్వెంట్ రూపొందింది. రోష‌న్‌ని హీరోగా ప‌రిచ‌యం చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ల‌వ్ స్టోరీలంటే నాకెంతో ఇష్టం’ అని ఈ సందర్భంగా నాగ్ స్పందించారు. ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ప్రేమ కథాంశంతో ముడిపడి ఉన్న ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది.
Samayam Telugu nirmala convent trailer
నిర్మలా కాన్వెంట్ ట్రైలర్ విడుదల



Happy to introduce Roshan in #Nirmala Convent, a fresh pure love story. #Goodluck Roshan. I love lovestories.♡https://t.co/UsFbLZagEo— Nagarjuna Akkineni (@iamnagarjuna) July 2, 2016

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.