యాప్నగరం

నితిన్ ట్వీట్: రాయుడు గారు క్షమించండి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘కాటమరాయుడు’టీజర్ సృష్టిస్తున్న సునామీకి రికార్డులు బద్దలౌతుంటే.. ఫాన్స్ ఆనందానికి లిమిట్స్ ఉంటాయా... ఎప్పటినుండో ఎదురు చూస్తోన్న కాటమరాయుడు టీజర్ వచ్చీ రావడంతోనే రికార్డ్స్‌ని బ్రేక్ చేయడంతో పవన్ వీరాభిమనులు ఓ రేంజ్‌లో రియాక్ట్ అవుతున్నారు.

TNN 6 Feb 2017, 6:09 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘కాటమరాయుడు’టీజర్ సృష్టిస్తున్న సునామీకి రికార్డులు బద్దలౌతుంటే.. ఫాన్స్ ఆనందానికి లిమిట్స్ ఉంటాయా... ఎప్పటినుండో ఎదురు చూస్తోన్న కాటమరాయుడు టీజర్ వచ్చీ రావడంతోనే రికార్డ్స్‌ని బ్రేక్ చేయడంతో పవన్ వీరాభిమనులు ఓ రేంజ్‌లో రియాక్ట్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్‌కు సాధారణ అభిమానులే కాకుండా టాలీవుడ్‌ హీరోస్‌లో కూడా అతన్నిదేవుడిలా భావించే కుర్ర హీరోలు ఉన్నారు వారిలో ఫస్ట్ ప్లేస్ ఎవరంటే హీరో నితిన్‌ది.
Samayam Telugu nithiin apologizes for his katama rayudu tweet
నితిన్ ట్వీట్: రాయుడు గారు క్షమించండి


పవన్ వీరాభిమాని నితిన్ ‘కాటమరాయుడు’ టీజర్ విడుదలైన కాసేపటికే మనోడికి అది పిచ్చ పిచ్చగా నచ్చేయడంతో ట్విట్టర్‌లో ఆ టీజర్‌ను పోస్ట్ చేస్తూ.. ''రాయుడులు ఎంత మంది ఉన్నా... 'కాటమరాయుడు' ఒక్కడే ఉంటాడనే అర్ధం వచ్చే విధంగా ఓ పోస్ట్ పెట్టాడు.

దీంతో సోషల్ మీడియాలో నితిన్‌కు వ్యతిరేకంగా రాయుడు పేరుతో సినిమాలు చేసిన పలువురు సీనియర్ స్టార్ హీరోల అభిమానులు ట్వీట్స్ చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా మోహన్ బాబు అభిమానులు బాగా హర్టయ్యారు. అంతే కాదు నితిన్‌కి వ్యతిరేకంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

దీంతో పరిస్థితి తెలుసుకొని ఆ పోస్ట్ ను వెంటనే తీసేశాడు నితిన్.. కానీ అప్పటికే అది కాస్త వైరల్ అవ్వడంతో తాను ఎవరినీ ఉద్దేశించి ఆ ట్వీట్ చేయలేదని.. అభిమానుల మనోభావాలను బాధ పెట్టి ఉంటే క్షమించండి అంటూ ట్వీట్ చేశారు. నితిన్ క్షమాపణలపై మంచు లక్ష్మి స్పందించి ఇట్స్ ఓకే అని అనడంతో .. ఈ గొడవ సద్దుమణిగినట్లే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.