యాప్నగరం

‘భీష్మ’ టీజర్: మీమ్స్ చేసే ఐఏఎస్, ఏసీపీ కథ

నితిన్, రష్మిక మందన నటించిన సినిమా ‘భీష్మ’. ఈ సినిమా టీజర్‌ను తాజాగా విడుదల చేశారు.

Samayam Telugu 12 Jan 2020, 12:02 pm
యంగ్ హీరో నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న ‘భీష్మ’ టీజర్ వచ్చేసింది. వెటకారమైన పంచ్‌లతో మొదలైన ఈ టీజర్ ఆద్యంతం కామెడీగా సాగింది. ‘నీ పేరేంటి’ అని నితిన్‌ను క్యారెక్టర్ ఆర్టిస్ట్ సంపత్ అడిగితే.. ‘భీష్మ’ అంటాడు. అప్పుడు ఆయన ‘భీష్మ కాదు భీష్మ సర్ అనాలి’ అంటాడు. ఇందుకు నితిన్ స్పందిస్తూ.. ‘అంటే నా పేరుకి సర్ యాడ్ చేస్తే బాగోదేమో’ అని వేసిన పంచ్ నవ్వులు పూయిస్తోంది. ఏం చేస్తుంటావ్ అని అడిగితే.. మీమ్స్ చేస్తుంటానని చెప్తాడు. కానీ రష్మిక దగ్గర మాత్రం ఐఏఎస్, ఏసీపీ అని తిరుగుతుంటాడు.
Samayam Telugu bheeshma teaser
భీష్మ టీజర్


‘నా అదృష్టం ఆవగింజంతే ఉంటే దురదృష్టం దబ్బకాయ ఉందండి’ అంటూ నితిన్ బాధపడుతూ చెప్తున్న డైలాగ్ కామెడీగా ఉంది. వెంకీ కుడుముల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రష్మికను కేవలం హీరోయిన్‌గా చూపించారే తప్ప ఆమె పాత్రకు ఎలాంటి ప్రాధాన్యం లేదని టీజర్‌ను బట్టి అర్థమవుతోంది. ఇందులో బ్రహ్మాజీ, వీకే నరేష్, వెన్నెల కిశోర్, రఘుబాబు కామెడీ సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యేలా ఉంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫిబ్రవరి 21న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
See Photo Story: యాంకర్ అనసూయ సెక్సీ హాట్ పోజులు.. సూపర్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.