యాప్నగరం

నితిన్ ‘లై’టీజర్: అశ్వద్దామ హతః కుంజరహా

LIE Movie Teaser: ‘లై’మూవీ పోస్టర్స్‌తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసిన యూత్ స్టార్ నితిన్.. ‘లై’ టీజర్‌తో ప్రేక్షకులముందుకు వచ్చేశాడు.

TNN 11 Jul 2017, 11:05 pm
‘లై’మూవీ పోస్టర్స్‌తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసిన యూత్ స్టార్ నితిన్.. ‘లై’ టీజర్‌తో ప్రేక్షకులముందుకు వచ్చేశాడు. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం 'లై' (లవ్‌ ఇంటెలిజెన్స్‌ ఎన్‌మిటి). ఎమోషనల్ ప్రేమకథా చిత్రాలతో టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించిన హను రాఘవపూడి డిఫరెంట్ మేకింగ్‌ స్టైల్‌తో ‘లై’ చిత్రాన్ని తెరకెక్కించాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్.
Samayam Telugu nithin new film lie teaser talk
నితిన్ ‘లై’టీజర్: అశ్వద్దామ హతః కుంజరహా


నితిన్ గత చిత్రాలకు భిన్నంగా స్టైలిష్ అండ్ యాక్షన్ లుక్‌తో అదరగొట్టేస్తున్నాడు. ‘కోట్ల మంది సైనికులు సరిపోలేదట.. పంచ పాండవులు సాధించలేదట.. చివరికి శ్రీకృష్ణుడు ఒంటరి కాదట, అబద్ధం తోడు లేకుండా ఏ కురుక్షేత్రం పూర్తవదట.. అశ్వద్దామ హతః కుంజరహా’అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీ టీజర్ చాలా ఇంప్రెసివ్‌గా ఉంది. అర్జున్ విలన్‌గా తనదైన స్టైల్‌లో ఫర్ఫామెన్స్ ఇస్తుంటే.. మణివర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సినిమా థీమ్‌ను బాగా ఎలివేట్ చేసింది. మొత్రానికి నితిన్ ‘లై’ టీజర్‌తో సినిమాపై హైప్‌ని డబుల్ చేశాడు. మరి ‘లై’ సినిమా ప్రేక్షకుల అంచనాలకు రీచ్ అవుతుందో లేదో తెలియాలంటే ఆగష్టు11 వరకూ ఆగాల్సిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.