యాప్నగరం

నితిన్ ‘పెద్దపులి’ సాంగ్ ఊపేస్తోందిగా!

నువ్ పెద్దపులి, నువ్ పెద్దపులి అంటూ ఊరమాస్ బీట్ సాంగ్‌తో సందడి చేస్తున్నాడు యంగ్ హీరో నితిన్.

TNN 9 Mar 2018, 10:02 pm
నువ్ పెద్దపులి.. నువ్ పెద్దపులి.. అంటూ ఊరమాస్ బీట్ సాంగ్‌తో సందడి చేస్తున్నాడు యంగ్ హీరో నితిన్. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌‌గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌, సుధాకర్‌ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న‘ఛల్‌ మోహన్‌ రంగ’ మూవీ నుండి ‘పెద్దపులి’ సాంగ్‌ను కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది చిత్రయూనిట్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ‘చల్ మోహన రంగ’ చిత్రానికి కథను అందిస్తుండగా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Samayam Telugu nithins chal mohan ranga third single pedda puli
నితిన్ ‘పెద్దపులి’ సాంగ్ ఊపేస్తోందిగా!


నితిన్‌‌కి ‘ఛల్ మోహన్ రంగ’ 25వ చిత్రం. ఈ సినిమాలో నితిన్ సరసన మేఘా ఆకాశ్ జోడీ కడుతోంది. దాదాపు షూటింగ్ పూర్తి కావడంతో ప్రమోషన్స్ వర్క్స్‌ని వేగవంతం చేసింది చిత్ర యూనిట్. కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ లభిస్తుండంతో శుక్రవారం ‘పెద్దపులి’ సాంగ్‌ను విడుదల చేశారు. తెలంగాణ యాసతో ఫుల్ మాస్ బీట్‌తో తమన్ అదిరిపోయే దరువేశాడు.. ఈ సాంగ్‌పై మీరూ ఓ లుక్కేయండి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.