యాప్నగరం

నిత్యా మీనన్.. నో అనేది అందుకేనా!

అందం, అభినయం కలగలిపిన అతి తక్కువ మంది నటీమణుల్లో నిత్యమీనన్ ఒకరు.

TNN 22 Mar 2017, 7:55 pm
అందం, అభినయం కలగలిపిన అతి తక్కువ మంది నటీమణుల్లో నిత్యమీనన్ ఒకరు. తన నటనతో పాత్రకు పూర్తి న్యాయం చేసే నిత్య మలయాళం అమ్మాయి అయినప్పటికీ తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది.
Samayam Telugu nithya menon busy with direction plans
నిత్యా మీనన్.. నో అనేది అందుకేనా!


తమిళంలో కూడా ఆమె సినిమాలకు చక్కటి ఆదరణ లభిస్తుంటుంది. అటువంటి నిత్య గత కొంత కాలంగా కొత్త సినిమాలు సైన్ చేయడం లేదు.. దానికి కారణం ఆమెకు నచ్చిన పాత్రలు రాకపోవడమే అనే వార్తలు వినిపించాయి. వాస్తవానికి ఈ గ్యాప్ ఆమె కావాలని నటనను దూరంగా ఉండాలని తీసుకుందట.

నిత్యకు దర్శకత్వంవైపు ఆసక్తి ఉందని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది. ఆ ఆసక్తితోనే ఆమె రెండు కథలను సిద్ధం చేసుకుందని చెబుతున్నారు. అందులో ఓ కథకు నిర్మాత కూడా దొరికాడని సమాచారం. త్వరలోనే ఈ కథతో ఆమె సెట్స్ పైకి వెళుతుందని టాక్. మరి నటిగా ఇప్పటికే తన టాలెంట్‌ను చాటుకున్న నిత్య డైరెక్టర్‌గా కూడా మెప్పిస్తుందేమో చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.