యాప్నగరం

నితిన్ రేటుకి నిర్మాతల షాక్!

'అ ఆ' సినిమాతో పెద్ద హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న నితిన్‌కు ఈ మధ్య టాలీవుడ్‌లో డిమాండ్ బాగానే పెరిగింది.

TNN 27 Jan 2017, 9:13 pm
'అ ఆ' సినిమాతో పెద్ద హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న నితిన్‌కు ఈ మధ్య టాలీవుడ్‌లో డిమాండ్ బాగానే పెరిగింది. దానికి తగ్గట్లే తను కూడా కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇందులో భాగంగా ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.
Samayam Telugu nitin demanding for high remuneration
నితిన్ రేటుకి నిర్మాతల షాక్!


ఈ సినిమాలో అలనాటి హీరో అర్జున్ విలన్ పాత్రలో నటిస్తుండడం విశేషం. అయితే ఇప్పటివరకు నితిన్ సినిమాకు 5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకునేవాడు. 'అ ఆ' సినిమాకు మరో రెండు కోట్లు పెంచి ఇచ్చారు. హను సినిమాకు కూడా ఆ రేంజ్ పారితోషికమే అందుకుంటున్నాడని టాక్.

అయితే దాని తరువాత చేయబోయే సినిమాలకు మాత్రం రెమ్యూనరేషన్ పెంచాలని ఫిక్స్ అయ్యాడు మన హీరో. దీంతో తనను సంప్రదిస్తోన్న నిర్మాతలకు 10 కోట్లు రెమ్యూనరేషన్ ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాడట. నితిన్‌కు ప్రస్తుతం మార్కెట్ ఉంది కాబట్టి కొంత మంది నిర్మాతలు రెమ్యూనరేషన్ విషయం పెద్దగా పట్టించుకోవడం లేదు. సక్సెస్ ఉన్న హీరో కనుక లాభాలు కూడా అలానే ఉంటాయని వారి నమ్మకం.

కాని చిన్న నిర్మాతలైతే నితిన్‌తో సినిమా చేయాలనే ఆశను వదిలేసుకుంటుంన్నారట. ఇప్పటికీ బాగానే ఉంది కానీ లాంగ్ రన్‌లో నితిన్ మార్కెట్ ఎలా ఉంటుందో చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.