యాప్నగరం

నితిన్ కొత్త సినిమా షూటింగ్ మొదలైంది

8 నెలల గ్యాప్ తర్వాత నితిన్ మరో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టాడు.

Samayam Telugu 6 Jan 2017, 10:38 pm
8 నెలల గ్యాప్ తర్వాత నితిన్ మరో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టాడు. అందాల రాక్షసి, కృష్ణగాడి వీరప్రేమగాథ చిత్రాల ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఇవాళ ప్రారంభమైన ఈ సినిమాను 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ నిర్మిస్తోంది. ఈ సినిమాకు 'LIE' అనే ఆసక్తికరమైన టైటిల్‌ని పెట్టారు. 'లవ్ ఈజ్ ఎండ్‌లెస్' అనేది ఈ టైటిల్ ట్యాగ్‌లైన్.
Samayam Telugu nitin reddy starts shooting for his next movie lie
నితిన్ కొత్త సినిమా షూటింగ్ మొదలైంది


నితిన్ సరసన తమిళ యంగ్ హీరోయిన్ మెఘా ఆకాష్ జంటగా నటించనుంది. ప్రస్తుతం గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్షన్‌లో ధనుష్ సరసన ఓ సినిమా చేస్తోందీ యంగ్ లేడి. అన్నట్టు సంక్రాంతికి స్టార్ట్ కానున్న అఖిల్ అక్కినేని కొత్త సినిమాలోనూ ఈమే హీరోయిన్ అనే సంగతి తెలిసిందే. స్క్రిప్ట్ ప్రకారం ఈ సినిమాలో అధిక భాగం అమెరికాలో షూటింగ్ జరుపుకోనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.