యాప్నగరం

‘బ్రోచేవారెవరురా’ నివేదా పోస్టర్‌ నాట్యమే

నివేదా థామస్‌ లీడ్ రోల్‌లో నటిస్తున్న ‘బ్రోచేవారెవరురా’ మూవీ ఫస్ట్ లుక్‌ను విడుదలైంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ‘మిత్ర’ అనే ప్రయోగాత్మక పాత్ర చేయబోతుంది నివేదా.

Samayam Telugu 30 Mar 2019, 6:27 pm
జెంటిల్‌మెన్, నిన్నకోరి, జై లవకుశ, 118 చిత్రాలతో నటిగా నిరూపించుకున్న నివేదా థామస్ ప్రయోగాత్మక పాత్రతో ప్రేక్షకుల ముందుకురాబోతుంది. ఆకట్టుకునే రూపం మంచి హావభావాలతో హీరోయిన్ పాత్రకు పూర్తి న్యాయం చేసే నివేదా థామస్ ‘బ్రోచేవారెవరురా’ నాట్యకళాకారిణి అవతారంలో సర్‌ప్రైజ్ చేసింది.
Samayam Telugu బ్రోచేవారెవరురా


వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫస్ట్ లుక్‌‌ టైటిల్‌‌ని సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది నివేదా. ‘చలనమే చిత్రము.. చిత్రమే చలనము’ అనేది క్యాప్షన్. డాన్స్ నేపథ్యంలో ఉండే ఈ చిత్రంలో నివేదా థామస్.. ‘మిత్ర’ అనే క్లాసిక్ డాన్సర్‌గా కనిపించబోతుంది. మన్యం ప్రొడక్షన్స్ పతాకంపై విజయ్ కుమార్ మన్యం నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీ విష్ణు, సత్యదేవ్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.