యాప్నగరం

నివేదాను వెంటాడుతున్న ‘అక్టోబర్ 15’

జెంటిల్‌మేన్, నిన్నుకోరి, జై లవకుశ సినిమాలతో కుర్రకారు గుండెలు కొల్లగొట్టిన నివేదా థామస్‌... ‘అక్టోబర్ 15’ అనగానే ‘అమ్మో’ అంటోంది. అంతేకాదు, ‘గూగుల్’ను సైతం దుమ్మెత్తి పోస్తోంది.

TNN 15 Oct 2017, 4:51 pm
జెంటిల్‌మేన్, నిన్నుకోరి, జై లవకుశ సినిమాలతో కుర్రకారు గుండెలు కొల్లగొట్టిన నివేదా థామస్‌... ‘అక్టోబర్ 15’ అనగానే ‘అమ్మో’ అంటోంది. అంతేకాదు, ‘గూగుల్’ను సైతం దుమ్మెత్తి పోస్తోంది. ఫేవరెట్ హీరోయిన్ పుట్టిన రోజు అంటే.. అభిమానులు వెల్లువలా బర్త్‌డే విషెస్ చెప్పడం మామూలే. అయితే, సోషల్ మీడియా వచ్చాక అది మరింత సులభమైపోయింది. అక్టోబరు 15 రాగానే నివేదాకు వెల్లువలా పుట్టిన రోజు విషెస్ వస్తున్నాయి.
Samayam Telugu nivetha thomas worrying about oct 15th
నివేదాను వెంటాడుతున్న ‘అక్టోబర్ 15’


అయితే, సంతోషించాలి గానీ విచారం ఎందుకనే కదా మీ ప్రశ్న. అయితే, ఆమె బాధ విషెస్ గురించి కాదు, గూగుల్‌లోని వీకీపీడియా చేసిన తప్పిదం గురించి. అందులో ఆమె బర్త్‌డే అక్టోబరు 15 అని ఉంది. దీంతో, ఆదివారం ఆమెకు అభిమానుల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. దీంతో ఆమె ట్వీట్ చేయక తప్పలేదు. ‘‘నన్ను విష్ చేయడానికి మీ సమయం వెచ్చిస్తున్నారు. ఈ రోజు నా పుట్టిన రోజు కాదు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే’’ అని పేర్కొంది. ఆ పోస్ట్ చూసిన అభిమానుల ఉత్సాహం ఒక్కసారిగా నీరుగారిపోయింది. అయితే, తన పుట్టిన రోజు నవంబరు 2న అని నివేదా గతేడాదే స్పష్టత ఇచ్చింది. మరి, ఆ విషయం ఎంతమందికి గుర్తుందో!

నివేదితా ట్వీట్: https://twitter.com/i_nivethathomas/status/919437582508814336
To everyone taking their time to wish me, today is not my B’day! :) Take care and have a great day 😊 — Nivetha Thomas (@i_nivethathomas) October 15, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.