యాప్నగరం

వరస ఫ్లాఫుల హీరో సినిమా మంచి వ్యాపారమే!

ఈ మధ్యన వరస ప్లాఫులతో సతమతం అవుతున్నాడు సాయి ధరమ్ తేజ్.

Samayam Telugu 20 Jun 2018, 5:26 pm
ఈ మధ్యన వరస ప్లాఫులతో సతమతం అవుతున్నాడు సాయి ధరమ్ తేజ్. ఈ హీరో గత మూడు సినిమాలు ఫ్లాఫులుగా నిలిచాయి. ఒక దశలో హిట్లతో ఊపు మీదకు వచ్చిన ఈ హీరోని తదుపరి సినిమాలు దెబ్బతీశాయి. అయితే ఇలా వరస ఫ్లాఫులతో ఉన్న ఈ హీరో తాజా సినిమా మాత్రం ప్రీ రిలీజ్ మార్కెట్‌లో మంచి వ్యాపారమే చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. కరుణాకరన్ దర్శకత్వంలో సాయిధరమ్ హీరోగా ‘తేజ్ ఐ లవ్యూ’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.
Samayam Telugu tej


కరుణాకరన్ కూడా అంత ఫామ్ లో లేడు. ఈ దర్శకుడు హిట్ ఇచ్చి చాలా కాలం అయిపోయింది. అయినప్పటికీ ఈ సినిమాకు ప్రీరిలీజ్ వ్యాపారంలో పాజిటివ్ బజ్ రావడం గమనార్హం. ఈ సినిమాను దాదాపు పదిహేను కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారట. విశేషం ఏమిటంటే.. ఈ బడ్జెట్‌ను ప్రీ రిలీజ్ మార్కెట్‌లో రాబట్టేసుకున్నారు దీని రూపకర్తలు. థియేటరికల్ రైట్స్ ద్వారానే పదిహేను కోట్ల రూపాయల వ్యాపారం జరిగిందట. దీంతో తేజ్ రూపకర్తలు సేఫ్ జోన్లోకి వచ్చారు.

అలాగే ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ కూడా మంచి ధరకే పలికినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీంతో... విడుదలకు ముందే నిర్మాతలకు లాభాలు అందినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్‌లో ఇలా సాయి ధరమ్ సినిమా సత్తా చూపించింది. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు ఏ మేరకు రాబడుతుందో చూడాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.