యాప్నగరం

లాల్ సార్!! హో షిట్టూ.. కట్టప్ప జస్ట్ మిస్

ఇండియన్ సినిమా స్టామినాను ప్రపంచానికి తెలిసేలా చేసిన మూవీ బాహుబలి 2. ఈ సినిమాతో ఇంటర్నేషల్ స్టార్స్‌గా మారారు ఇందులోని నటీనటులు.

TNN 17 May 2017, 2:24 pm
ఇండియన్ సినిమా స్టామినాను ప్రపంచానికి తెలిసేలా చేసిన మూవీ బాహుబలి 2. ఈ సినిమాతో ఇంటర్నేషల్ స్టార్స్‌గా మారారు ఇందులోని నటీనటులు. అయితే హీరో హీరోయిన్ల సంగతి పక్కన పెడితే.. కట్టప్ప క్యారెక్టర్ ఈ సినిమా విడుదలకు ముందే హైప్ క్రియేట్ దోహదపడింది అనడంటంలో ఎలాంటి సందేహం లేదు.
Samayam Telugu not sathyaraj but mohanlal was the first choice of rajamouli for kattappas role in baahubali
లాల్ సార్!! హో షిట్టూ.. కట్టప్ప జస్ట్ మిస్


బాహుబలి పార్ట్ 1‌లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అన్న ఒకే ఒక ప్రశ్న థియేటర్స్‌కు జనాలు పరుగులు పెట్టేలా చేసింది. బాహుబలి అంటే ప్రభాస్, రాజమౌళి పేర్లు ఎలా గుర్తుకు వస్తాయో ఆ తరువాత మనకు వెంటనే గుర్తుకు వచ్చే పేరు కట్టప్ప అలియాస్ సత్యరాజ్.

వాస్తవానికి బాహుబలి సినిమాలో కట్టప్ప క్యారెక్టర్‌ సత్యరాజ్ ఇంత క్రేజ్ వస్తుందని యూనిట్ కూడా భావించలేదు. కాని హీరోతో సమానమైన క్రేజ్ ఈ క్యారక్టర్‌కు రావడంతో అయ్యో.. కట్టప్ప క్యారెక్టర్ నేను చేసి ఉంటే బాగుండేదే అని సూపర్ స్టార్‌లు సైతం తలలు పట్టుకుంటున్నారు.

నిజానికి బాహుబలి మూవీలో కట్టప్ప క్యారెక్టర్ కోసం మొదట మళయాల సూపర్ స్టార్ మోహన్‌ లాల్‌ను సంప్రదించారట దర్శకధీరుడు రాజమౌళి. ఆయనకు ఉన్న ఇమేజ్ సినిమాకు ప్లస్‌గా మారే అవకాశం ఉన్నందున కట్టప్పగా నటించమని మోహన్ లాల్‌ను కోరగా .. ఆయన సున్నితంగా తిరస్కరించారట.

లాల్ అప్పటికే పలు ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటంతో పాటు అన్ని ఏళ్లపాటు ఒకే సినిమాకు లాక్ అయిపోవడం ఇష్టం లేని మోహన్ లాల్ ఈ ప్రాజెక్ట్‌కు నో చెప్పరట. కాని సినిమా విడుదలయ్యక కట్టప్ప క్యారెక్టర్‌కు వస్తున్న రెస్పాన్స్ చూసి ఇలాంటి సినిమాకోసం ఐదేళ్లు కాదు పదేళ్లైనా వెయిట్ చేయొచ్చనే అభిప్రాయానికి వచ్చారట.

మొత్తానికి కోరివచ్చిన అవకాశాన్ని కాదన్న మోహన్ లాల్‌పై సోషల్ మీడియాలో పలు ఇంట్రస్టింగ్ పోస్ట్‌లు షేర్ చేస్తున్నారు సినీ అభిమానులు. మోహన్ లాల్ చేసి ఉంటే బాగుండనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ సత్యరాజ్ మామ కూడా ఏం తక్కువా? చింపేశాడు అంటూ ఆయన అభిమానులు అంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.