యాప్నగరం

రానా ‘డీజే’ని కొట్టేశాడు బాస్..

బాహుబలి చిత్రంతో రానా క్రేజ్.. హైవే రోడ్‌పై బెంజ్ కార్ జర్నీలా జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది.

TNN 29 Jun 2017, 3:13 pm
బాహుబలి చిత్రంతో రానా క్రేజ్.. హైవే రోడ్‌పై బెంజ్ కార్ జర్నీలా జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమాతో రానా ఇంటర్నేషనల్ స్థాయి నటుడిగా మారాడు. అయితే ఆ సినిమాలో విలన్‌గా నటించి ఆకట్టుకున్న రానా .. సోలో హీరోగా గట్టి హిట్ కొట్టేందుకు ‘నేనే రాజు నేనే మంత్రి’ మూవీతో ప్రేక్షకుల ముందుకురానున్నాడు. తేజ దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో రానా సరసన కాజల్, కేథరిన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Samayam Telugu nrnm hindi dubbing rights for rana daggubatis next sold for rs 11 cr
రానా ‘డీజే’ని కొట్టేశాడు బాస్..


ఇటీవల విడుదలైన ‘నేనే రాజు నేనే మంత్రి’ ట్రైలర్‌‌లో జోగేంద్రగా రానా పెర్ఫామెన్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో పాటు రానాకి ఉన్న మార్కెట్ దృష్ట్యా ఈ సినిమాను నాలుగు భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. దీనిలో భాగంగా హిందీలో ఈ మూవీ రైట్స్ రికార్డ్స్ ప్రైజ్‌కు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. బాహుబలి చిత్రానికి ముందే బాలీవుడ్‌కు పరిచయమైన రానా లేటెస్ట్ మూవీ రైట్స్‌ను ఏకంగా 11 కోట్లకు అమ్ముడవడంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి.

కాగా ఇటీవల విడుదలై కలెక్షన్స్‌లో దూసుకుపోతున్న అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథమ్ మూవీ రైట్స్ కేవలం 8 కోట్లకు అమ్ముడు కాగా .. మహేష్ బాబు ‘స్పైడర్’20 కోట్లతో తొలిస్థానంలో ఉంది. ఇప్పుడు రానా ‘నేనే రాజు నేనే మంత్రి’ మూవీ 11 కోట్లను వసూలు చేయడంతో రెండో స్థానంలో నిలిచింది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈమూవీకి ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ‘నేనే రాజు నేనే మంత్రి’ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.