యాప్నగరం

NTR 30 మళ్లీ వాయిదా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి మళ్లీ నిరాశ

NTR 30 update: ఎన్టీఆర్‌, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌బోతున్న‌ NTR 30 పూజా కార్య‌క్ర‌మాల‌ను ఫిబ్ర‌వ‌రి 24న ప్రారంభించాల‌ని అనుకున్నారు. అయితే ఇప్పుడు తార‌క‌ర‌త్న చ‌నిపోవ‌టంతో ఈవెంట్‌ను వాయిదా వేశారు.

Authored byతుమ్మల మోహన్ | Samayam Telugu 20 Feb 2023, 6:03 pm
Jr Ntr - NTR 30: RRR వ‌చ్చి దాదాపు ఏడాది కావ‌స్తుంది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ అభిమానులు త‌మ అభిమాన హీరో సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇంత వ‌ర‌కు ఎన్టీఆర్ త‌న NTR 30 సినిమాను లాంచ‌నంగా ప్రారంభించ‌నేలేదు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై రూపొందాల్సిన పాన్ ఇండియా సినిమా పూజా కార్య‌క్రమాల‌ను ఫిబ్ర‌వరి 24న ప్రారంభించాల‌నుకున్నారు. డేట్ ఫిక్స్ అయ్యింది. అయితే ఇప్పుడు మ‌ళ్లీ NTR 30 పూజా కార్య‌క్ర‌మాల‌కు అనుకోని అవాంత‌రం ఎదురైంది. తార‌క‌ర‌త్న అనుకోకుండా చ‌నిపోవ‌టంతో ఇప్పుడు ఎన్టీఆర్ 30వ సినిమా లాంచింగ్‌ను వాయిదా వేశార‌ట మేక‌ర్స్‌.
Samayam Telugu ntr 30
NTR 30, ఎన్టీఆర్ 30


త్వ‌ర‌లోనే మ‌రో మంచి రోజు చూసుకుని NTR 30 పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తార‌ట‌. రెగ్యుల‌ర్ షూటింగ్‌ను మార్చి 20న ప్రారంభిస్తారు. ఆలోపు ఎన్టీఆర్, చ‌ర‌ణ్ అండ్ రాజ‌మౌళితో క‌లిసి లాస్ ఏంజిల్స్‌లో జ‌రగ‌బోయే ఆస్కార్ అవార్డ్ వేడుక‌కి వెళ్లి వ‌స్తారు. దాని త‌ర్వాత యంగ్ టైగ‌ర్ త‌న ఫుల్ ఫోక‌స్‌ను NTR 30పైనే పెట్ట‌బోతున్నారు. ఈ సినిమాను సెప్టెంబ‌ర్, అక్టోబ‌ర్ కంతా పూర్తి చేయాల‌ని కొర‌టాల శివ‌కు కండీష‌న్ పెట్టార‌ట మ‌న నంద‌మూరి నాయ‌కుడు. అందుకు కార‌ణం త‌న త‌దుప‌రి సినిమాను ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా యూనిక్ పాయింట్‌తో క‌థ‌ను సిద్ధం చేశార‌ట కొర‌టాల శివ‌. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి 2024 ఏప్రిల్ 5న సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేశారు.

NTR 30 మూవీ కోసం హైదరాబాద్‌లో ఇప్పటికే భారీ సెట్‌ని నిర్మిస్తున్నారు. కొన్ని రోజుల పాటు ఈ సెట్‌లోనే షూట్ చేసేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కొరటాల శివ - జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ఇప్పటికే ‘జనతా గ్యారేజ్’ మూవీ వచ్చింది. 2016లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలవడంతో NTR 30పై కూడా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ ఎవరు? అనేదానిపై కూడా ఇంకా క్లారిటీ రాలేదు. జాన్వీ కపూర్ పేరు వినిపిస్తోంది.

ALSO READ: Anushka Shetty లేటెస్ట్ లుక్స్ చూసి ఖంగు తిన్న ఫ్యాన్స్.. ఆంటీలా ఉందంటూ ట్రోలింగ్

ALSO READ: వెంకీ పాన్ ఇండియా మూవీలో కోలీవుడ్ స్టార్

ALSO READ: Chiranjeevi: పూరీ జ‌గ‌న్నాథ్‌కి మెగాస్టార్ చిరంజీవి కండీష‌న్స్‌.. కుస్తీ ప‌డుతున్న డైరెక్ట‌ర్
ALSO READ: Jr Ntr - Taraka Ratna: తారకరత్నకు జూనియర్ ఎన్టీఆర్ ఆర్థిక సాయం!

ALSO READ: Rajinikanth: అన్నయ్య మీద బంగారు నాణేలు కురిపించిన రజినీకాంత్.. కారణం ఇదే

ALSO READ: Taraka Ratna Demise:తారకరత్నకి కలిసి రాని నెంబర్.. పాపం అదే రోజున క‌న్నుమూత

రచయిత గురించి
తుమ్మల మోహన్
మోహ‌న్ కుమార్ తుమ్మ‌ల స‌మ‌యం తెలుగులో డిజిట‌ల్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. ఇక్కడ సినిమాల‌కు సంబంధించిన అప్‌డేట్స్, వార్తలను రాస్తుంటారు. మోహ‌న్ కుమార్‌కి సినీ జ‌ర్న‌లిజంలో 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. గ‌తంలో ప్ర‌ముఖ మీడియా సంస్థ‌ల్లో సినీ జ‌ర్న‌లిస్టుగా వ‌ర్క్ చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.