యాప్నగరం

'గౌతమిపుత్ర' ట్రైలర్‌పై స్పందించిన ఎన్టీఆర్, కల్యాణ్ రామ్!

నందమూరి అభిమానులు సంబరపడే సందర్భం వచ్చింది. హరికృష్ణ, బాలకృష్ణ కుటుంబాల మధ్య కానీ లేదా...

Samayam Telugu 17 Dec 2016, 7:07 am
నందమూరి అభిమానులు సంబరపడే సందర్భం వచ్చింది. హరికృష్ణ, బాలకృష్ణ కుటుంబాల మధ్య కానీ లేదా బాబాయి, అబ్బాయిల మధ్య అంతగా సత్సబంధాలు లేవనే ఓ నెగటివ్ టాక్‌కి చెక్ పెడుతూ నిన్న అబ్బాయిలు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు ఇద్దరూ బాబాయి కొత్త సినిమా ట్రైలర్‌పై ప్రశంసలు గుప్పించడం విశేషం. బాబాయి బాలకృష్ణ 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్ శుక్రవారం రిలీజైన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్‌కి అభిమానుల నుంచే కాకుండా పరిశ్రమవర్గాల నుంచి కూడా భారీ స్పందన కనిపించింది.
Samayam Telugu ntr and kalyanram tweets about gautamiputra satakarni trailer
'గౌతమిపుత్ర' ట్రైలర్‌పై స్పందించిన ఎన్టీఆర్, కల్యాణ్ రామ్!

"Desam Meesam Thippudam" . Babai looks outstanding in the Trailer of Gautamiputra Satakarni https://t.co/sWeepgXRqY kudos @DirKrish #NBK100— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) December 16, 2016
Phenomenal trailer of #GPS.Babai at his best.Kudos @DirKrish for showcasing NBK like never before https://t.co/jFxzWA7SMy #GPSTrailerStorm— tarakaram n (@tarak9999) December 16, 2016
అయితే, ఎంతమంది ఎన్నిచెప్పినా, ఏం కాంప్లిమెంట్స్ ఇచ్చినా... అబ్బాయిలు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు ట్విటర్ ద్వారా ఇచ్చిన కాంప్లిమెంట్స్ మాత్రమే ఇప్పుడు బాగా హైలైట్ అయ్యాయనే టాక్ వినిపిస్తోంది. బాబాయి నటించిన సినిమా ట్రైలర్ ఎంత గొప్పగా వచ్చిందనేదాని గురించి అబ్బాయిలు చేసిన పాజిటివ్ కామెంట్స్ నందమూరి అభిమానులని సైతం ఆకట్టుకుంటున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.