యాప్నగరం

RRR మూవీ మరో ఘనత.. హాలీవుడ్ అవార్డుకు నామినేట్

కలెనక్షన్ల పరంగా.. ఓటీటీలో వ్యూస్ పరంగా రికార్డులు బద్దలు కొట్టిన RRR మూవీ మరో ఘనతను సొంతం చేసుకుంది. ప్రతిష్టాత్మక టాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుకు నామినేట్‌ అయింది.

Authored byAshok Krindinti | Samayam Telugu 29 Jun 2022, 1:43 pm

ప్రధానాంశాలు:

  • RRR మూవీకి అరుదైన అవకాశం
  • టాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుకు నామినేట్‌
  • హర్షం వ్యక్తం చేస్తున్న మూవీ లవర్స్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu RRR Movie
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) కాంబినేషన్‌లో వచ్చిన RRR మూవీ ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొడుతూ.. బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. మార్చి 24న విడుదలైన ఈ సినిమా ఇటు బిగ్ స్క్రీన్లలోనూ.. అటు ఓటీటీలోనూ సంచలన విజయం నమోదు చేసింది. దాదాపు రూ.1200 పైగా వసూలు చేసి ఇండియా వైడ్‌గా టాప్ సినిమాలలో ఒకటిగా నిలిచింది.
తాజాగా ఈ సినిమాలో మరో ఘనతను సొంతం చేసుకుంది. ప్రతిష్టాత్మక టాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుకు నామినేట్‌ అయింది. బెస్ట్ పిక్చర్ కేటగిరీలో RRR మూవీకి చోటు దక్కింది. టాప్ గన్ మావ్రీక్ (Top Gun Maverick), ది బ్యాట్‌మెన్ (The Batman), టర్నింగ్ రెడ్ (Turning Red), ఎవరీథింగ్ ఎవరివన్ ఆల్ ఎట్ వన్స్ (Everything Everyone All At Once) తదితర సినిమాలతో RRR పోటీ పడనుంది.

RRR మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ మొదలైనప్పటి నుంచి హాలీవుడ్ కళాకారులు, విమర్శకులు ఈ సినిమా గురించి విపరీతంగా చర్చించుకున్నారు. ఇటీవల విదేశీ ప్రేక్షకులు చూసిన భారతీయ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా అమెరికాలో RRR మూవీ మంచి విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా హాలీవుడ్ అవార్డుకు నామినేట్ కావడం పట్ల సినీ ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

1920 కాలంలో బ్రిటీష్ బ్యాక్‌డ్రాప్‌లో RRR మూవీని తెరకెక్కించారు. జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్‌గా.. రామ్ చరణ్ మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్రలో నటించారు. ఇద్దరు యోధులు కలిసి బ్రిటీష్ పాలకులను ఎదురిస్తే.. ఎలా ఉంటుందనే ఆలోచనతో జక్కన్న ఈ మూవీని రూపొందించారు. బాలీవుడ్ స్టార్స్‌ అజ‌య్ దేవ‌గ‌ణ్‌, అలియా భ‌ట్‌తో పాటు రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడి, ఒలివియా మోరిస్ వంటి హాలీవుడ్ తార‌లు RRR మూవీలో యాక్ట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.