యాప్నగరం

NTR: ‘ఎన్టీఆర్‌’లో RX 100 భామ.. ఏ పాత్రకో తెలుసా?

‘RX 100’లో కిస్సులతో కైపెక్కించిన పాయల్.. సహజ నటిగా మెప్పిస్తుందా?

Samayam Telugu 26 Nov 2018, 12:45 pm
‘ఆర్ఎక్స్ 100’ అంద చందాలతో కుర్రకారును పిచ్చెక్కించిన పాయల్ రాజ్‌పుత్.. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘యన్.టి.ఆర్-కథానాయకుడు’ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ‘ఆర్ఎక్స్ 100’ సినిమా తర్వాత అవకాశాలు వస్తున్నా.. ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ భామ ఈ సినిమాలో ఛాన్స్ అనగానే ఎగిరి గంతేసిందట.
Samayam Telugu Untitled1211


ఈ సినిమాను క్రిష్ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తొలి భాగంలో ఎన్టీఆర్‌‌ తెలుగు చలన చిత్ర రంగంలో మహా నటుడిగా ఎలా ఎదిగారనేది చూపనున్నారు. రెండో భాగంగా ఆయన మహా నాయుకుడిగా రాజకీయాలను ఎలా ఏలారనేది చూపనున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని పలు ప్రధాన పాత్రలకు నటీ నటుల ఎంపిక పూర్తయ్యింది.
తాజాగా ప్రముఖ నటి జయసుధ పాత్ర కోసం పాయల్ రాజ్‌పుత్‌ను చిత్రయూనిట్ సంప్రదించినట్లు తెలిసింది. అయితే, దీనిపై చిత్రయూనిట్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. పాయల్ ప్రస్తుతం తమిళంలో ‘యాంజిల్’, ‘ఇరువర్ ఉల్లం’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.