యాప్నగరం

ఎన్టీఆర్ రెడీ.. ‘బిగ్ బాస్’ లుక్ అదుర్స్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలో బుల్లితెరపై మెరవనున్నాడు. హిందీలో సూపర్ హిట్ అయిన ‘బిగ్ బాస్’ షోను తెలుగులో స్టార్ మా చానల్ ప్రాసరం చేయనుంది.

TNN 13 Jun 2017, 2:11 pm
​ యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలో బుల్లితెరపై మెరవనున్నాడు. హిందీలో సూపర్ హిట్ అయిన ‘బిగ్ బాస్’ షోను తెలుగులో స్టార్ మా చానల్ ప్రాసరం చేయనుంది. ఈ షోకు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇప్పుడు దీన్ని అధికారికంగా ఎన్టీఆర్ ఖరారు చేశారు. ఈరోజు ఆయన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఫస్ట్ పోస్టర్‌ను కూడా ట్వీట్ చేశారు. బ్లాక్ షూట్‌, లోపల వైట్ షర్ట్‌లో ఎన్టీఆర్ లుక్ అదిరిపోయింది. త్వరలోనే ఈ తెలుగు ‘బిగ్ బాస్’ షో టీవీల్లో ప్రసారం కానుంది. ఈ షో కోసం ఎన్టీఆర్ భారీ పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం.
Samayam Telugu ntr confirms that he will be hosting bigg boss show in telugu
ఎన్టీఆర్ రెడీ.. ‘బిగ్ బాస్’ లుక్ అదుర్స్!

I can see you #BiggBossTelugu pic.twitter.com/cpvsHvpWue — Jr NTR (@tarak9999) June 13, 2017
కాగా, హిందీలో ‘బిగ్ బాస్’ షోను సల్మాన్ ఖాన్ నడిపిస్తున్నారు. ఈ సూపర్ షోను తెలుగులో ఎన్టీఆర్‌తో నడిపించబోతున్నారనే వార్త రాగానే ఆయన ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ కొత్త ప్రొఫెషనల్ లుక్‌ని చూసి అభిమానులు లేచి గెంతులేయడం ఖాయం. తమిళంలోనూ ‘బిగ్ బాస్’ షోను నిర్వహిస్తున్నారు. అక్కడ లోకనాయకుడు కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.