యాప్నగరం

Nuvvu Nenu E Kshanam Song: ‘రొమాంటిక్’ ఫస్ట్ సాంగ్.. పూరీ!! ఇదేం రసకేళి బాబోయ్

పూరీ జగన్నాథ్ అంటే పచ్చిగా సినిమాలు తీస్తాడనే పేరు ఉంది. దాదాపు ఆయన సినిమాలు అన్నీ A సర్టిఫికేట్‌తో వస్తుంటాయి. పక్కా అడల్ట్ కంటెంట్‌ ఆయన సినిమాలో మస్ట్‌గా ఉంటుంది. ఇటీవల ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కిన పూరీ జగన్నాథ్.. తన కొడుకు ఆకాష్ పూరీతో ‘రొమాంటిక్’ అనే ప్యూర్ లవ్ స్టోరీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, మాటలను పూరి జగన్నాథ్ అందిస్తుండగా.. కొత్త దర్శకుడు అనిల్ పాదూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం నాడు ‘నువ్వు నేను ఈ క్షణం’ అనే రొమాంటిక్ సాంగ్‌ను విడుదల చేశారు.

Samayam Telugu 21 Dec 2019, 8:32 pm

Samayam Telugu nuvvu nenu e kshanam video song from romantic starring akash puri and ketika sharma
Nuvvu Nenu E Kshanam Song: ‘రొమాంటిక్’ ఫస్ట్ సాంగ్.. పూరీ!! ఇదేం రసకేళి బాబోయ్

పూరీ వాయిస్‌తో మొదలైన సాంగ్..

శనివారం సాయంత్రం 5 గంటలకు ‘రొమాంటిక్‌’ సినిమాలోని ఫస్ట్‌ వీడియో సాంగ్‌ ‘నువ్వు నేను ఈ క్షణం’ అనే సాంగ్‌ను విడుదల చేశారు. ‘దేశాన్ని ప్రేమించడం వేరు.. ఆడదాన్ని ప్రేమించడం వేరు.. ఐ లవ్ ఇండియా రూపాయి ఖర్చు ఉండదు. ఐ లవ్ యు సరదా తీరిపోద్ది’ అంటూ పూరీ జగన్నాథ్‌ వాయిస్‌తో మొదలైన ఈ పాట ట్యూన్స్, లిరిక్స్ సంగతి పక్కన పెడితే.. పిక్చరైజేషన్ పూర్తిగా పూరీ మార్క్‌తో ఉంది. బీచ్ పక్కన హీరో హీరోయిన్లు రెచ్చిపోయి రొమాన్స్ చేస్తున్నారు.

ఈ రేంజ్ రొమాన్స్ చూసి ఉండరు..

‘రేయి పగలూ ఎదురు చూశా ఈ క్షణం కోసం.. కోటి బంధాలు పెట్టుకున్నా ఈ ఘడియ కోసం..
ఏ నాకు ఉండదా? ఆ కోరిక? నీకు నా మీద ఎలా ఉందో.. నాకు నీ మీదా అలాగే ఉంది. ఇది ప్రేమో.. మోహమో.. మరొకటో.. మరొకటో.. ఏ పేరైతేనేం.. ఈ క్షణం నీతో ఉన్నా.. అది చాలు నాకు. మరో క్షణం గురించి ఆలోచిస్తూ.. ఈ క్షణాన్ని వేస్ట్ చేయను. మళ్లీ మళ్లీ కలుస్తామో.. మళ్లీ ఇలా బతుకు తామో ఎవరికి తెలుసు. కలిసిన ప్రతిసారీ ఇదే మోహం ఇలాగే ఉంటుందనే గ్యారంటీ ఏంటి? ఈ క్షణం ఈ మోహం. నువ్వూ నేనూ ఈ సముద్రం’ అంటూ హీరోయిన్ కేతికా శర్మ మితిమీరి అందాలను ప్రదర్శిస్తూ హీరో ఆకాష్‌తో సముద్రం పక్కన రసకేళిలో తేలియాడుతోంది.

ఈ పాటను ఎవరు రాశారు.. ఎవరు పాడారంటే!

ఈ సాంగ్‌కు లిరిక్స్ స్వయంగా పూరీ జగన్నాథ్ అందించగా.. చిన్మయి శ్రీపాద ఆలపించింది. సునీల్ కష్యప్ సంగీతం అందించారు. ఈ మూవీలో ఆకాశ్‌ సరసన ఢిల్లీకి చెందిన మోడల్ కేతికా శర్మ హీరోయిన్‌గా నటించింది. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మాణంలో తెరకెక్కుతోంది ‘రొమాంటిక్’ చిత్రం.

See Photo Story: ఆకాశ్ పూరీ అస్సలు ఆగట్లేడుగా.. మరీ ఇంత 'రొమాంటిక్‌'గానా!

పేరుకు పాటే కాని.. ఇదో రొమాంటిక్ వీడియో

సాంగ్‌ అంటే ట్యూన్స్, లిరిక్స్ వీటిని ప్రామాణికంగా ఊహిస్తాం. కాని ‘రొమాంటిక్’ చిత్రం నుండి విడుదలైన ఈ సాంగ్‌ను ప్యూర్ సాంగ్ అని అనలేం. రెండున్నర నిమిషాల నిడివితో ఓ రొమాంటిక్ వీడియోను వదిలారు పూరీ.

‘రొమాంటిక్’ టైటిల్ న్యాయం చేస్తున్నాడా?

ఇందులో మొత్తం రొమాన్స్‌కే పెద్ద పీటవేసి సినిమా టైటిల్‌కి యాప్ట్ అనిపించాడు పూరీ. కొడుకుతో ఓ రేంజ్‌ రొమాన్స్ చేయించాడు. ఇలా కూడా పాట తీయొచ్చా అన్నట్టుగా హీరోయిన్‌ని వివిధ భంగిమల్లో వాడేశాడు పూరీ. ‘రొమాంటిక్’ పెద్దలకు మాత్రమే అనే హింట్ ఈ సాంగ్‌తో ముందే ఇచ్చేశాడు పూరీ.

Video-Romantic Movie సాంగ్: బీచ్‌లో ఢిల్లీ పిల్లతో పూరీ కొడుకు పచ్చిగా!

Twitter-#Romantic An intense love story 💖 #NuvvuNenuEks...

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.