యాప్నగరం

అల్లువారబ్బాయి.. ఇద్దరు హీరోలతో పోటీ!

సంవత్సరాంతంలో ఇక రెండే పెద్ద సినిమాలున్నాయి. వాటిల్లో ముందుగా రాబోయేది ‘ఎంసీఏ’.

TNN 18 Dec 2017, 5:34 pm
సంవత్సరాంతంలో ఇక రెండే పెద్ద సినిమాలున్నాయి. వాటిల్లో ముందుగా రాబోయేది ‘ఎంసీఏ’. నాని హీరోగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 21న విడుదల కాబోతోంది. ఇక భారీ బడ్జెట్ సినిమా, పెద్ద అంచనాలున్న సినిమా ‘హలో’ ఆ మరుసటి రోజు..అంటే డిసెంబర్ 22న విడుదల కాబోతోంది. ఈ సంవత్సరాంతంలో రాబోతున్న ఈ క్రేజీ సినిమాలకు తోడు మరో సినిమా పోటీలో నిలవబోతోంది. అదే ‘ఒక్క క్షణం’.
Samayam Telugu okka kshanam to be released on 23 dec
అల్లువారబ్బాయి.. ఇద్దరు హీరోలతో పోటీ!


అల్లు శిరీష్ హీరోగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 23న విడుదల కాబోతోంది. ఈ హీరో నటించిన గత సినిమా‘శ్రీరస్తు శుభమస్తు’ ఫర్వాలేదనిపించింది. ఈ నేపథ్యంలో వరసపెట్టి ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. ఈ రకంగా చూస్తే.. ‘ఒక్క క్షణం’శిరీష్ కి కీలకమైన సినిమా. హీరోగా నిలదొక్కుకోవడానికి హిట్టు అత్యవసరం ఇప్పుడు.

ఇలాంటి నేపథ్యంలో ఇద్దరు యంగ్ హీరోలతో తలపడుతున్నాడు శిరీష్. వరస విజయాల మీద ఉన్న నానితో, రెండో సినిమాతో సత్తా చాటాలని చూస్తున్న అఖిల్ తో శిరీష్ పోటీ పడబోతున్నాడు. అఖిల్ సినిమాకు దర్శకుడు విక్రమ్ కె.కుమార్ పెద్ద ప్లస్ పాయింట్. విక్రమ్ గత హిట్స్ నేపథ్యంలో ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. నాని విజయపరంపరల నేపథ్యంలో మిడిల్ క్లాస్ అబ్బాయ్ కచ్చితంగా ఆకర్షిస్తుంది. ఈ రెండు సినిమాలూ ఏ మాత్రం పాజిటివ్ టాక్ పొందినా.. సంక్రాంతి వరకూ హవా కొనసాగుతుంది. వీటి మధ్యన రాబోతున్న ‘ఒక్కక్షణం’ హిట్ అనిపించుకుంటే..ఉనికిని చాటగలదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.