యాప్నగరం

భరత్ మృతికి కారణం కూడా అదే

సినిమా యాక్టర్ రవితేజ సోదరుడు, నటుడు భరత్ మృతితో తెలుగు సినీపరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. రవితేజకి...

Samayam Telugu 25 Jun 2017, 4:15 pm
సినిమా యాక్టర్ రవితేజ సోదరుడు, నటుడు భరత్ మృతితో తెలుగు సినీపరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. రవితేజకి సోదరుడిగానే కాకుండా నటుడిగాను పలు చిత్రాల్లో నటించిన భరత్‌కి సినీపరిశ్రమతో అనుబంధం కలిగివుండటం అందుకు ఒక కారణం అయితే, రవితేజతో చాలామంది సినీప్రముఖులుకి వున్న సన్నిహిత సంబంధాలు మరో కారణం. ఎందరో దర్శకులు, నిర్మాతలతో కలిసి పనిచేసిన రవితేజ వాళ్లందరితోనూ సత్సంబంధాలు కలిగి వున్నారు. ఈ క్రమంలోనే ఓ అనుకోని ప్రమాదంలో రవితేజ తన సోదరుడు భరత్‌ని కోల్పోవడంతో హైదరాబాద్‌లో అందుబాటులో వున్న సినీప్రముఖులు రవితేజ ఇంటికి చేరుకుని అతడి కుటుంబాన్ని పరామర్శించి తమ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.
Samayam Telugu over speed took the life of telugu actor bharat
భరత్ మృతికి కారణం కూడా అదే


తెలుగు సినీపరిశ్రమతోపాటు రాజకీయవర్గాల్లో ఎందరో ప్రముఖులు, వారి సంతానం రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందిన విధంగానే భరత్ కూడా ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తుదిశ్వాస విడిచారు. దాదాపు చాలా దుర్ఘటనల్లో మాదిరిగానే భరత్ మృతి విషయంలోనూ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమైందని ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు తెలిపారు.

ఔటర్ రింగ్ రోడ్డుపై శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వైపు కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్న భరత్ కొత్వాల్‌గూడ వద్ద ఆగి వున్న ఓ లారీని అతివేగంగా వెళ్లి ఢీకొట్టారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో భరత్ గంటకి 140 కి.మీపైగా వేగంతో కారు నడుపుతున్నట్టుగా కారు స్పీడోమీటర్ స్పష్టంచేస్తోంది. అత్యంత వేగంతో కారు నడిపిన కారణంగానే భరత్ డ్రైవ్ చేస్తున్న కారులో ఎయిర్ బెలూన్స్ తెరుచుకున్నప్పటికీ... అప్పటికే అతడు స్టీరింగ్‌ని అంతే బలంగా ఢీకొనడం, పగిలిన కారు అద్దాలు భరత్ ముఖంలో దిగిపోవడం జరిగిపోయింది.

కారు ముందు భాగం మొత్తం లారీ కిందకు దూసుకుపోగా... కారు అద్దాలతోపాటు డ్రైవింగ్ సీటు మాత్రమే వేగంగా లారీని ఢీకొట్టింది. దీంతో ఎయిర్ బెలూన్స్ తెరుచుకునేంత వ్యవధి కూడా లేకపోయింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భరత్, తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఒకవేళ భరత్ అంత వేగంగా కారు నడిపించనట్టయితే, ఆగి వున్న లారీని చూసినప్పుడు కారుని పక్కకు తప్పించడమో లేదా కారు వేగాన్ని నియంత్రించుకుని బ్రేకులు వేయడానికి ఆస్కారం వుండేది అని అక్కడ ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.