యాప్నగరం

కట్టి పడేస్తున్న ‘పద్మావతి’ రెండో పాట

పద్మావతి చిత్ర బృందం తాజాగా మరో పాటను విడుదల చేసింది. ‘ఏక్ దిల్.. ఏక్ జాన్..’ అంటూ సాగిపోయే ఈ సాంగ్ అభిమానులను కట్టిపడేస్తోంది.

TNN 11 Nov 2017, 3:07 pm
పద్మావతి సినిమాపై వివాదాలు కొనసాగుతుండగానే ఆ చిత్ర బృందం తాజాగా మరో పాటను విడుదల చేసింది. ‘ఏక్ దిల్.. ఏక్ జాన్..’ అంటూ సాగిపోయే ఈ సాంగ్ అభిమానులను కట్టిపడేస్తోంది. ఇప్పటికే విడుదలైన ‘ఘూమర్..’ సాంగ్ ఇంకా గుబాళింపు వెదజల్లుతూనే ఉండగా.. ఇప్పుడు వచ్చిన రెండో సాంగ్‌ సంగీతప్రియులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. అదిరిపోయే క్యాస్టూమ్స్‌తో రాణి ‘పద్మిని’గా దీపికా తన అందచందాలతో కనువిందు చేస్తుండగా.. రాజు ‘రతన్ సింగ్’గా షాహిద్ కపూర్ రాజసం పలికించారు.
Samayam Telugu padmavati ek dil ek jaan video song presenting deepika padukone and shahid kapoors love
కట్టి పడేస్తున్న ‘పద్మావతి’ రెండో పాట


రాణి పద్మిని, భర్త రావల్ రతన్ సింగ్ మధ్య ప్రేమను అద్భుతంగా తెరకెక్కించి మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు.. దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ. తేలికైన మాటలతో ఏఎం తురాజ్.. పాటకు మంచి సాహిత్యం అందించారు. సింగర్ శివమ పాతక్ తనదైన శైలిలో దీన్ని మరో స్థాయికి తీసుకెళ్లాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.