యాప్నగరం

సీబీఎఫ్‌సీ చైర్‌పర్సన్ పహ్లజ్ నిహ్లానికి ఉద్వాసన

సీబీఎఫ్‌సీ చైర్ పర్సన్‌గా తరచు వివాదాల్లో మునిగి తేలుతున్న పహ్లాజ్ నిహ్లాని ఉద్వాసనకు గురయ్యారు. ఆయన స్థానంలో గేయ రచయిత..

TNN 11 Aug 2017, 7:48 pm
సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఇన్ ఇండియా (సీబీఎఫ్‌సీ) చైర్‌పర్సన్‌ బాధ్యతల నుంచి పహ్లజ్ నిహ్లానీని తప్పించారు. ఆయన స్థానంలో ప్రముఖ గేయ రచయిత, కవి ప్రసూన్ జోషి బాధ్యతలు చేపట్టనున్నట్లు టైమ్స్ నౌ వెల్లడించింది. 2015 జనవరిలో సీబీఎఫ్‌సీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టింది మొదలు నిహ్లాని వివాదాలతో సహవాసం చేస్తున్నారు. ఉడ్తా పంజాబ్‌తోపాటు అనేక ఇతర సినిమాల్లో భారీ స్థాయిలో సీన్లను తొలగించాలని ఆయన ఆదేశించారు. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది.
Samayam Telugu pahlaj nihalani sacked as cbfc chief to be succeeded by prasoon joshi
సీబీఎఫ్‌సీ చైర్‌పర్సన్ పహ్లజ్ నిహ్లానికి ఉద్వాసన


వాస్తవానికి నిహ్లానీ పదవీ కాలం మూడేళ్లు. ఆయన టర్మ్ 2018 జనవరితో ముగియాల్సి ఉంది. కానీ ఈలోగానే ప్రభుత్వం ఆయనకు ఉద్వాసన పలికింది. పహ్లనీ మొండి వైఖరితో సినీ నిర్మాతలు విసిగిపోయారు. పహ్లజ్ సెన్సార్ విధానమే ఆయన పదవికి ఎసరు తెచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. తాజాగా జబ్ హారీ మెట్ సెజాల్ సినిమాలో ఇంటర్‌కోర్స్ అనే పదాన్ని బీప్ చేయాలంటూ ఆయన సూచించడం వివాదాస్పదమైంది. సినిమాల్లో మద్యం సేవిస్తున్న దృశ్యాలు ఉంటే A సర్టిఫికెట్ ఇవ్వనున్నట్లు సెన్సార్ బోర్డ్ ఇటీవలే ప్రకటించింది. దీంతో నిహ్లానిని బాధ్యతల నుంచి తప్పిస్తారని జూలై 25నే వార్తలు వెలువడ్డాయి.

నిహ్లానీ స్థానంలో సెన్సార్ బోర్డ్ చైర్‌పర్సన్‌గా ఎంపికైన ప్రసూన్ జోషి బెస్ట్ లిరిక్స్ విభాగంలో రెండుసార్లు జాతీయ అవార్డు అందుకున్నారు. 2015లో ఆయన్ను పద్మశ్రీ వరించింది. సీబీఎఫ్‌సీ సభ్యురాలి హీరోయిన్ విద్యాబాలన్‌ను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.