యాప్నగరం

'పైసా వసూల్' టీజర్ వచ్చేస్తోంది

ప్రస్తుతం నందమూరి అభిమానులు అంతా ఎదురుచూస్తున్న బాలకృష్ణ అప్‌కమింగ్ మూవీ పైసా వసూల్ టీజర్ విడుదలకి...

TNN 25 Jul 2017, 8:15 pm
ప్రస్తుతం నందమూరి అభిమానులు అంతా ఎదురుచూస్తున్న బాలకృష్ణ అప్‌కమింగ్ మూవీ పైసా వసూల్ టీజర్ విడుదలకి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నెల 28వ తేదీన పైసా వసూల్ మూవీ టీజర్‌ని విడుదల చేయనున్నట్టు స్వయంగా ఆ చిత్ర యూనిట్ ప్రకటించింది. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని సెప్టెంబర్ 1న రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
Samayam Telugu paisa vasools teaser to release on 28th july
'పైసా వసూల్' టీజర్ వచ్చేస్తోంది


బాలయ్య బాబు సరసన శ్రియ శరన్ జంటగా నటిస్తుండగా ముస్కాన్, కైరా దత్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బాలకృష్ణ కెరీర్‌లో 101వ సినిమాగా తెరకెక్కుతున్న పైసా వసూల్ మూవీకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ఈ సినిమాలోని పలు కీలక సన్నివేశాలు పోర్చుగల్‌లో తెరకెక్కాయి. త్వరలోనే ఆడియో లాంచ్ ఫంక్షన్ సైతం నిర్వహించనున్నట్టు పైసా వసూల్ నిర్మాత ఆనంద్ ప్రసాద్ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.