యాప్నగరం

ఎవరా అజ్ఞాతవాసి? ఫోటోలు లీక్..

టాలీవుడ్‌లో లీకుల బెడద వీడటం లేదు. అందునా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అయితే ఈ లీకులు మరీ ఎక్కువగా ఉంటున్నాయ్.

TNN 4 Nov 2017, 4:21 pm
టాలీవుడ్‌లో లీకుల బెడద వీడటం లేదు. అందునా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అయితే ఈ లీకులు మరీ ఎక్కువగా ఉంటున్నాయ్. గతంలో ఆయన నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమాను ఆన్ లైన్‌లో పెట్టేసిన లీకు రాయుళ్లు తాజాగా త్రివిక్రమ్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘అజ్ఞాతవాసి’ షూటింగ్ లొకేషన్‌లోని ఫోటోలను నెట్‌లో లీక్ చేశారు. దీంతో చిత్ర యూనిట్ షాక్‌లో ఉంది.
Samayam Telugu pawan kalyan and anu emmanuel leaked pics from agnathavasi
ఎవరా అజ్ఞాతవాసి? ఫోటోలు లీక్..


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- అనుఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న ‘అజ్ఞాతవాసి’ షూటింగ్ షెడ్యూల్డ్‌ హైదరాబాద్‌లో ముగియడంతో ఇటీవల విదేశాలకు పయనం అయ్యింది. కాగా అక్కడ షూటింగ్ లొకేషన్స్‌లో పవన్ కళ్యాణ్, అనుఇమ్మాన్యుయేల్ ఫోటోలను సెల్ ఫోన్‌తో షూట్ చేసి నెట్‌లో పెట్టేశారు. అయితే ఇది షూటింగ్ స్పాట్‌లో ఉన్న క్రూ పనే అని తెలుస్తోంది. ప్రస్తుతం యూరప్‌లో చివరి షెడ్యూల్డ్‌లో ఉన్న ‘అజ్ఞాతవాసి’ షూటింగ్ త్వరలో గుమ్మడికాయ కొట్టేందుకు రెడీగా ఉంది.

కీర్తిసురేష్‌, అను ఇమ్మానియేల్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం ద్వారా కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుద్ ఈ సినిమాతో సంగీత ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌కి ప‌రిచ‌యం కానున్నాడు. కుష్బూ, బొమన్ ఇరాని కీల‌క‌మైన పాత్ర‌ల్లో కనిపిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సాఫ్ట్ వేర్‌గా కనిపించబోతుండగా.. 2018 సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రి 10న ‘అజ్ఞాతవాసి’ విడుద‌ల కానుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.