యాప్నగరం

మనల్ని ఎవడ్రా ఆపేదిక్కడ.. పవన్ కళ్యాణ్ ఆన్ ఫైర్! వీడియో వైరల్

‘భీమ్లా బ్యాక్‌ ఆన్‌ డ్యూటీ’ అంటూ సంగీత దర్శకుడు తమన్‌ ఓ ర్యాప్‌ సాంగ్‌ రిలీజ్ చేయడంతో అది నెట్టింట వైరల్‌గా మారింది. 'మనల్ని ఎవడ్రా ఆపేదిక్కడ' అంటూ పవన్ చెబుతున్న డైలాగ్ హైలైట్ అవుతోంది.

Samayam Telugu 8 Mar 2022, 9:43 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన భీమ్లా నాయక్ థియేటర్స్‌లో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఫిబ్రవరి 25న విడుదలైన ఈ సినిమా ఇప్పటికే 150 కోట్ల క్లబ్‌లో చేరిపోయి కల్లెక్షన్స్ పరంగా భేష్ అనిపించుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘భీమ్లా బ్యాక్‌ ఆన్‌ డ్యూటీ’ అంటూ సంగీత దర్శకుడు తమన్‌ ఓ ర్యాప్‌ సాంగ్‌ రిలీజ్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది.
Samayam Telugu మనల్ని ఎవడ్రా ఆపేదిక్కడ.. పవన్ కళ్యాణ్ ఆన్ ఫైర్
Bheemla Nayak


''వచ్చాడు భీమ్లా.. గ్రానైట్‌ బాంబులా.. కల్లోలం చేస్తాడు చూసుకో సాలా.. లాఠీతో చాలా.. ఉంటాది దూల...షురూ చేసిండంటే.. కాళ్లు మొక్కాలా'' అంటూ సాగే ఈ పాటను ఆసక్తికరంగా మలిచారు. 'మనల్ని ఎవడ్రా ఆపేదిక్కడ' అంటూ పవన్ కళ్యాణ్ గర్జిస్తున్న డైలాగ్ హైలైట్ అవుతోంది. ఈ వీడియోలో కీలక సన్నివేశాలతోపాటు చిత్రీకరణ సమయంలో చోటుచేసుకున్న సరదా సంఘటనలను జత చేశారు. దీంతో విడుదలైన కాసేపట్లోనే ఈ వీడియో వైరల్‌గా మారింది.

సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ భీమ్లా నాయక్ చిత్రాన్ని నిర్మించారు. సాగ‌ర్ కె.చంద్ర దర్శకత్వం వహించగా త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. పవన్ కళ్యాణ్, రానా ద‌గ్గుబాటి హీరోలుగా.. నిత్యామీన‌న్‌, సంయుక్తా మీన‌న్ హీరోయిన్లుగా న‌టించారు. వెండితెరపై పవన్ కళ్యాణ్ నటన, వేరియేషన్స్ ఆయన అభిమానులకు పూనకాలు తెప్పించాయి.
ఆయన మాటల్లో వెటకారం..! కృష్ణం రాజు క్యారెక్టర్‌పై ప్రభాస్ కామెంట్స్
ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి రూ. 106.75 కోట్లు బిజినెస్‌ జరిగింది. దీంతో 108 కోట్ల రూపాయల టార్గెట్ పెట్టుకొని బరిలోకి దిగిన భీమ్లా నాయక్ ఆ దిశగా అడుగులేస్తున్నాడు. రీసెంట్‌గా ఈ మూవీ హిందీ ట్రైలర్ రిలీజ్ చేసి బీటౌన్ ఆడియన్స్ దృష్టిని లాగేశారు మేకర్స్. మరికొద్ది రోజుల్లో ఈ మూవీ హిందీ వర్షన్ రిలీజ్ కానుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.