యాప్నగరం

కేంద్రంలోని ఎంపీలంతా జనంలాగే క్యూలో నిలబడితే బాగుంటుంది -పవన్ కల్యాణ్

రూ.500, రూ.1000 పాత నోట్ల రద్దు ప్రక్రియ అనంతరం బ్యాంకు ఎకౌంట్‌లో వున్న తన డబ్బులు తాను తీసుకోవడం కోసం కర్నూలులో...

Samayam Telugu 26 Nov 2016, 6:45 pm
రూ.500, రూ.1000 పాత నోట్ల రద్దు ప్రక్రియ అనంతరం బ్యాంకు ఎకౌంట్‌లో వున్న తన డబ్బులు తాను తీసుకోవడం కోసం కర్నూలులో గత మూడురోజులుగా ఏటీఎంలు, ఎస్బీఐ బ్యాంకు వద్ద క్యూలో పడిగాపులు కాసిన బాలరాజు అనే వ్యక్తి మృతి చెందిన ఘటన అందరినీ కలచివేసింది. అయితే, ఇదే ఘటనపై స్పందించిన సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్... బాలరాజు గారి కుటుంబసభ్యులకి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేస్తున్నట్టు తెలిపారు.
Samayam Telugu pawan kalyan comments on mps to with draw money by standing in que at atms and banks
కేంద్రంలోని ఎంపీలంతా జనంలాగే క్యూలో నిలబడితే బాగుంటుంది -పవన్ కల్యాణ్

pic.twitter.com/3LbPf83xtb— Pawan Kalyan (@PawanKalyan) November 26, 2016
pic.twitter.com/E5QfwYrI07— Pawan Kalyan (@PawanKalyan) November 26, 2016
శనివారం సాయంత్రం ట్విటర్ వేదికగా బాలరాజు కుటుంబానికి సానుభూతి ప్రకటించిన పవన్.. కేంద్రంలో వున్న ఎంపీలంతా ప్రజల కష్టానికి సంఘీభావం తెలపడానికి బ్యాంకుల దగ్గర క్యూలో నిలబడితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఆంధ్రా, తెలంగాణ ఎంపీలు కూడా అదే తరహాలో బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూలో నిలబడి డబ్బులు డ్రా చేసుకుని ప్రజలకి తమ వంతు మద్దతు పలికితే, వారికీ కాస్త ధైర్యంగా ఉంటుంది అని ఇరు రాష్ట్రాల ఎంపీలకు సూచించారు పవన్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.