యాప్నగరం

Pawan Kalyan: జనసేనానిపై ఆలీ కామెంట్స్.. వైరల్ అవుతోన్న ‘అత్తారింటికి దారేది’ సీన్

సీఎం జగన్ (YS Jagan) ఆదేసిస్తే పవన్ కళ్యాణ్‌పై (Pawan Kalyan) పోటీ చేయడానికి తాను సిద్ధమని సినీ నటుడు ఆలీ (Ali) చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై జనసేనాని అభిమానులు ఆలీని ట్రోల్ చేస్తున్నారు.

Authored byవరప్రసాద్ మాకిరెడ్డి | Samayam Telugu 19 Jan 2023, 4:07 pm

ప్రధానాంశాలు:

  • ఆలీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు
  • ‘అత్తారింటికి దారేది’ సినిమాలో ఆలీని పవన్ కొట్టే సీన్ వైరల్
  • కార్పోరేటర్‌‌గా కూడా పనికిరావంటూ విమర్శలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Pawan Kalyan and Ali
Pawan Kalyan: పవన్ కళ్యాణ్, ఆలీ
‘అత్తారింటికి దారేది’ సినిమాలో కమెడియన్ ఆలీని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చితక్కొట్టే సీన్ గుర్తుందా. మేనత్త మాటలకు నొచ్చుకుని చికాకుతో మెట్లపై కూర్చున్న పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లి ఒక సిగరెట్ ప్యాకెట్ తీసుకురమ్మని.. నువ్వు కూడా బీడీలు కొనుక్కో అని యాటిట్యూడ్ చూపిస్తూ ఆలీ (Ali) ఆర్డర్ వేస్తాడు. దీంతో పవన్ కళ్యాణ్‌కు చిర్రెత్తుకొస్తుంది. ఆలీ చెంపలు పగిలిపోతాయి. ‘‘నేనెవరో తెలుసా.. నా చెప్పులు తుడవడానికి కూడా నువ్వు పనికిరావు’’ అని ఆలీతో పవన్ కళ్యాణ్ అంటూ చెంపలు వాయిస్తారు. ఈ సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘అత్తారింటికి దారేది’ సినిమాలోని ఈ సీన్ సోషల్ మీడియాలో వైరల్ కావడానికి కారణం.. ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, సినీ నటుడు ఆలీ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశిస్తే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై పోటీచేయడానికి తాను సిద్ధమేనని ఆలీ నిన్న మీడియాతో మాట్లాడుతూ అన్నారు. రాజకీయాలకు సినిమాలకు స్నేహానికి సంబంధం లేదని చెప్పిన ఆలీ.. ఒకే ఇంట్లో సభ్యులు కూడా ఒకే పార్టీకి ఓటేయరని అభిప్రాయపడ్డారు.
బాస్ దెబ్బకు పగిలిపోయిన బాక్సాఫీస్.. 'వాల్తేరు వీరయ్య' వసూళ్ల వర్షం!
అయితే, ఆలీ మాటలకు హర్ట్ అయిన జనసైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పవన్ కళ్యాణ్‌కు ఆలీ ఎంత మంచి మిత్రుడో తెలిసిందే. ఒకరినొకరు ఏకవచనంతో పిలుచుకునేంత చనువు వారి మధ్య ఉంది. అయినప్పటికీ రాజకీయాల్లోకి వచ్చేసరికి ఆలీ రూటు మార్చారు. తన స్నేహితుడి పార్టీలో కాకుండా వైఎస్సార్‌సీపీలో చేరారు. అప్పట్లోనే దీనిపై బోలెడన్ని విమర్శలు వచ్చాయి. అయితే, ఇటీవల ఆలీకి ఏపీ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారులు బాధ్యతలు అప్పగించింది. అప్పటి నుంచీ ఆలీ ఏపీ ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రతిపక్షాలపై విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తిరుపతిలో రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆలీ.. మంత్రి రోజాపై పవన్ కళ్యాణ్, నాగబాబు చేస్తున్న విమర్శనలను తిప్పికొట్టారు. అలాగే, సీఎం జగన్ ఆదేశిస్తే పవన్ కళ్యాణ్ మీద సైతం పోటీచేయడానికి తాను సిద్ధమన్నారు. దీంతో ఆగ్రహానికి లోనైన జనసైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఆలీని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తు్న్నారు. ‘అత్తారింటికి దారేది’ సినిమాలో ఆలీని పవన్ కళ్యాణ్ కొట్టే సీన్‌‌తో ఆలీని ట్రోల్ చేస్తున్నారు. ఆలీని కించపరుస్తూ కామెంట్లు పెడుతున్నారు. సినిమా సీన్‌లో ఉన్నట్టుగానే.. పవన్ కళ్యాణ్ చెప్పులు తుడవడానికి కూడా ఆలీ సరిపోడని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, వైఎస్సార్‌సీపీ అభిమానులు ఆలీకి అండగా నిలుస్తున్నారు.
రచయిత గురించి
వరప్రసాద్ మాకిరెడ్డి
వరప్రసాద్ మాకిరెడ్డి సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో టెక్నాలజీ, క్రీడలు, సినిమా రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.