యాప్నగరం

‘కాటమరాయుడు’ రీషూట్?

పవన్ కల్యాణ్ నటించిన 'సర్ధార్ గబ్బర్ సింగ్' సినిమా వలన నష్టపోయిన పంపిణీదారుల కోసం ఈసారి 'కాటమరాయుడు' సినిమా చేస్తున్నాడు.

TNN 20 Jan 2017, 9:18 pm
పవన్ కల్యాణ్ నటించిన 'సర్ధార్ గబ్బర్ సింగ్' సినిమా వలన నష్టపోయిన పంపిణీదారుల కోసం ఈసారి 'కాటమరాయుడు' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలా అయినా.. వారికి వచ్చిన నష్టాల్ని పూడ్చి తన లిస్ట్‌లో ఓ హిట్ సినిమా వేసుకోవాలని సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. ప్రతి సన్నివేశం విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఎప్పటికప్పుడు తీసిన సీన్‌ని చెక్ చేసుకుంటున్నారట.
Samayam Telugu pawan kalyan katamarayudu movie shooting latest updates
‘కాటమరాయుడు’ రీషూట్?


తాజాగా సినిమా రషెష్ చూసిన పవన్ కల్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారట. ఆయనకు నచ్చని కొన్ని సన్నివేశాల్ని రీషూట్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. నిజానికి ఈ సినిమా కోసం ఇద్దరు రైటర్స్ పని చేశారు. ఇప్పుడు వారి స్థానంలో మరో కొత్త రైటర్‌ను తీసుకోవాలని పవన్ భావిస్తున్నట్లు టాక్. ఆ రచయితకు సలహాల బట్టి కొత్తగా సన్నివేశాల్నిచిత్రీకరించాలా? లేక ఉన్న సన్నివేశాలనే మార్పులు చేయాలనే విషయంలో నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

ఇలా రీషూట్స్ చేసుకుంటూ.. పోతే ఉగాదికి సినిమా వస్తుందో లేదో అని చిత్రబృందం టెన్షన్ పడుతోంది. కానీ పవన్ మాత్రం సినిమా ఎప్పుడు బాగా వస్తుందో అప్పుడే రిలీజ్ చేద్దాం టార్గెట్స్ మాత్రం పెట్టుకోవద్దని సూచిస్తున్నట్లు టాక్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.