యాప్నగరం

సంగారెడ్డిలో జనసేనాని

పవన్ కల్యాణ్ హీరోగా డాలీ దర్శకత్వంలో రూపొందుతోన్న 'కాటమరాయుడు' సినిమా షూటింగ్ ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో జరుగుతోంది

TNN 25 Jan 2017, 3:49 pm
పవన్ కల్యాణ్ హీరోగా డాలీ దర్శకత్వంలో రూపొందుతోన్న 'కాటమరాయుడు' సినిమా షూటింగ్ ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో జరుగుతోంది. పవన్‌, శ్రుతిహాసన్‌లతో పాటు చిత్ర బృందం ఇస్మాయిల్ ఖాన్ ప్రాంతంలో గల సప్త ప్రాకారయుత దుర్గా భవానీ మాత ఆలయంలో సందడి చేశారు. షూటింగ్‌కు సంబంధించిన కొన్ని జాతర సన్నివేశాలను చిత్రీకరించారు. మొత్తానికి అటు షూటింగ్‌లో బిజీగా ఉంటూనే ఇటు ప్రత్యేక హోదా కోసం తన పోరాటాన్ని సాగిస్తున్నారు పవన్.
Samayam Telugu pawan kalyan katamarayudu shooting at sangareddy
సంగారెడ్డిలో జనసేనాని


ట్విట్టర్ వేదికగా యువతను ఆలోచింపజేస్తున్నారు. ఈరోజు ఉదయం నుండి కేంద్రాన్ని ప్రశించే విధంగా ట్వీట్స్ పెడుతూనే ఉన్నారు. అలానే ఓ వైపు తన సినిమా షూటింగ్‌ను కూడా కంటిన్యూ చేస్తున్నారు.

జనవరి26న (రేపు) విశాఖపట్టణంలో స్పెషల్ స్టేటస్ కోసం జరగబోయే నిరసన కార్యక్రమానికి పవన్ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి పాల్గొంటాడని చెబుతున్నారు. మరి పవన్ వస్తాడా? రాడా? అనే విషయం ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. సోషల్ మీడియాలో మాత్రం 'మీ అభిమాన హీరో, జనసేనాని వస్తారా ? అంటూ పవన్ అభిమానులను ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విషయంలో పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.