యాప్నగరం

తరిమెల నాగి రెడ్డి గొప్పతనంపై పవన్ కల్యాణ్ ట్వీట్స్

కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి శత జయంతిని పురస్కరించుకుని ఆయన గొప్పతనం గురించి స్మరించుకున్నారు...

Samayam Telugu 22 Feb 2017, 11:41 am
కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి శత జయంతిని పురస్కరించుకుని ఆయన గొప్పతనం గురించి స్మరించుకున్నారు సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్. 1917లో ఫిబ్రవరి 11న తరిమెల నాగి రెడ్డి జన్మించారు. ఈ ఫిబ్రవరి 11తో 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అతడు రాసిన 'తాకట్టులో భారతదేశం' పుస్తకాన్ని పవన్ గుర్తుచేసుకున్నారు. తాను ఇంటర్మీడియెట్ చదువుతున్న రోజుల్లో తన తండ్రి ఆ పుస్తకాన్ని ఇచ్చారని, అయితే అప్పుడు తనకి ఆయన రాతల్లోని అర్థాన్ని గ్రహించలేకపోయాను కానీ ఇప్పుడున్న పరిస్థితులు మాత్రం ఆయన రాసిన పుస్తకానికి తగినట్టుగానే వున్నాయని ట్వీట్ చేశారు పవన్.
Samayam Telugu pawan kalyan reminds tarimela nagi reddy on his centenary
తరిమెల నాగి రెడ్డి గొప్పతనంపై పవన్ కల్యాణ్ ట్వీట్స్

#ComradeTarimelaNagiReddycentenary pic.twitter.com/j2IPI5g0NL — Pawan Kalyan (@PawanKalyan) February 19, 2017
#ComradeTarimelaNagiReddycentenary pic.twitter.com/iVYOLmEUw5 — Pawan Kalyan (@PawanKalyan) February 19, 2017
భూమి లేని నిరుపేదలకు ఆ రోజుల్లోనే 1000 ఎకరాలని భూములని పంచిపెట్టిన మహనీయుడు తరిమెల నాగిరెడ్డి అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు పవన్. మద్రాస్ అసెంబ్లీ సహా మూడుసార్లు ఎమ్మెల్యేగా, మరోసారి ఎంపీగా పనిచేసిన తరిమెలకు తలవంచి సెల్యూట్ చేస్తున్నాను అని ట్వీట్ చేశారు పవన్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.