యాప్నగరం

నితిన్‌కు పవన్ కళ్యాణ్ క్రిస్మస్ కానుక.. థాంక్యూ సో మచ్ అన్న!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు హీరో నితిన్ కృతజ్ఞతలు తెలిపారు. తన అభిమాన హీరో పంపిన గిఫ్ట్‌ చూసి ఆయన మురిసిపోయారు. ఈ ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

Samayam Telugu 24 Dec 2020, 8:53 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజ్నేవాతో కలిసి ఈ క్రిస్మస్‌ను ఎంతో ఆనందంగా జరుపుకోబోతున్నారు. క్రిస్మస్ సందర్భంగా వీరిద్దరూ తమ సెలబ్రిటీ ఫ్రెండ్స్‌కు, సన్నిహితులకు కానుకలు పంపిస్తున్నారు. పవన్ కళ్యాణ్, అన్నా లెజ్నేవా తమకు కానుకలు పంపినట్టు సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. వీరిద్దరికీ ఆమె కృతజ్ఞతలు కూడా తెలిపారు. అయితే, ఈ కానుకల ఖాతాలో మరో ఇద్దరు హీరోలు కూడా ఉన్నారు.
Samayam Telugu నితిన్, పవన్ కళ్యాణ్
Nithiin and Pawan Kalyan


మహేష్ బాబు కుటుంబంతో పాటు హీరోలు నితిన్, రానా దగ్గుబాటికి కూడా పవన్ కళ్యాణ్ క్రిస్మస్ కానుకలు పంపారు. ఈ విషయాన్ని ఈ ఇద్దరు హీరోలు ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. నితిన్ అయితే ఆనందాన్ని పట్టలేకపోయారు. తన అభిమాన నటుడు తనకు క్రిస్మస్ కానుక పంపండంతో ‘థాంక్యూ సో మచ్ అన్న’ అంటూ నితిన్ ఉప్పొంగిపోయారు. ఈ కానుకతో ఈసారి క్రిస్మస్ మరింత సంతోషంగా మారిందని అన్నారు.
మరోవైపు రానా దగ్గుబాటి సైతం ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్‌కు, అన్నా లెజ్నేవాకు కృతజ్ఞతలు తెలిపారు. వీరితో పాటు బండ్ల గణేష్‌కు కూడా పవన్ క్రిస్మస్ కానుక అందింది. కాగా, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశలో ఉంది. ప్రస్తుతం అరకు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక నితిన్ ‘అందాధున్’ రీమేక్‌లో నటిస్తున్నారు. ఆయన నటించిన ‘రంగ్ దే’ విడుదలకు సిద్ధమవుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.