యాప్నగరం

తమిళులను చూసైనా నేర్చుకోండి.. పవన్ ట్వీట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమిళనాడు జల్లికట్టు ఉద్యమంపై వరస ట్వీట్‌లను చేస్తూనే ఉన్నారు. తాజాగా ఈ ఉద్యమాన్ని చూసి ఏపి ప్రజలు నేర్చుకోవల్సింది చాలా ఉందంటూనే .. నేతలకు చురకలంటించారు.

TNN 21 Jan 2017, 7:03 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమిళనాడు జల్లికట్టు ఉద్యమంపై వరస ట్వీట్‌లను చేస్తూనే ఉన్నారు. తాజాగా జల్లికట్టుపై కేంద్రం ఆర్డినెన్స్ జారీచేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని జనసేన పార్టీ తరపున స్వాగతిస్తూ.. ఇది ప్రజా విజయంగా అభివర్ణించారు పవర్ స్టార్.
Samayam Telugu pawan kalyan sensational tweets on ap special status and jallikattu
తమిళులను చూసైనా నేర్చుకోండి.. పవన్ ట్వీట్


జల్లికట్టు, కోడిపందాల నిషేధంపై ఘాటుగా స్పందించిన పవన్ కళ్యాణ్ వాటికి మద్దతు తెలుపుతూ .. తాజాగా తమిళ నాడులో జరిగిన జల్లికట్టు ఉద్యమాన్ని చూసి ఆంధ్రులు చాలా నేర్చుకోవాలని.. అదే ఉద్యమ స్ఫూర్తితో ‘ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా’ సాధించాలన్నారు.

దీంతో పాటు పనిలో పనిగా రాజకీయ నాయకులకు చురకలంటించారు. మన లీడర్స్‌కి రాజకీయ నిబద్దత తక్కువ.. వ్యాపార అవసరాలు ఎక్కువ అంటూ.. మన నేతలు ఈ ఉద్యమాన్ని చూసి ఎంత వరకూ స్ఫూర్తి పొందుతారనే దానిపై సందేహాలు ఉన్నాయని.. ఒక వేళ రాజకీయ నేతలు రాజీపడినా ప్రజలు మాత్రం రాజీపడబోరన్న నమ్మకం నాకు ఉందంటూ జల్లికట్టు ఉద్యమాన్ని ‘ప్రత్యేక హోదా ఉద్యమం’ తో లింక్ చేస్తూ పవన్ కళ్యాణ్ ట్వీట్స్ చేశారు. # Jallikattu #Kodipandem #AP Special Category Status pic.twitter.com/XaocXn7k0t — Pawan Kalyan (@PawanKalyan) January 21, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.