యాప్నగరం

అవును.. పవన్ వార్నింగ్ ఇచ్చారు: ష‌క‌ల‌క శంక‌ర్

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలో తనని పవన్ కళ్యాణ్ తిట్టిన మాట వాస్తవమేనని ఇటీవల హీరోగా మారిన షకలక శంకర్

Samayam Telugu 12 Jul 2018, 8:41 am
సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలో తనని పవన్ కళ్యాణ్ తిట్టిన మాట వాస్తవమేనని ఇటీవల హీరోగా మారిన షకలక శంకర్ వెల్లడించాడు. కమేడియన్‌గా పలు సినిమాల్లో కనిపించిన షకలక శంకర్ జూన్ చివరి వారంలో విడుదలైన ‘శంభో శంకర’ సినిమాతో హీరోగా మారాడు.
Samayam Telugu 0


పవన్‌ కళ్యాణ్‌కి వీరాభిమానినని ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చిన ఈ కమేడియన్ ‘శంభో శంకర’ సినిమాలోనూ పవర్ స్టార్ మేనరిజాన్ని అనుకరించి తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు. తాజాగా తన సినిమా ప్రమోషన్‌లో భాగం జరిగిన ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన వార్నింగ్ గురించి శంకర్ పెదవి విప్పాడు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా సమయంలో శంకర్‌కి సెట్‌లోనే పవన్ గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి.

‘పవన్ కళ్యాణ్ నాకు దేవుడితో సమానం. ఆయనతో కలిసి సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. దీంతో.. షూటింగ్ జరిగినన్ని రోజులూ ఆయనని చూస్తూ ఉండిపోయాను. అయితే.. ఆ సినిమా డైరెక్టర్ తీసిన షాట్లే మళ్లీ తీస్తుండటం నాకు చాలా బాధగా అనిపించింది. ఆ సినిమాకి పవన్ కళ్యాణ్ నిర్మాతగా ఉండటంతో.. ఆయన డబ్బులను వృథా చేస్తున్నారంటూ కో-డైరెక్టర్‌పై ఓ సందర్భంలో కోప్పడ్డాను. విషయం.. పవన్ కళ్యాణ్ వరకూ వెళ్లింది. దీంతో.. ఆయన నన్ను పిలిపించి.. అప్పుడే డైరెక్టర్, కో-డైరెక్టర్‌లను తిట్టే రేంజ్‌కి వెళ్లిపోయావా..? వాళ్లు ఎన్ని షాట్లు తీస్తే నీకెందుకు..? ఎంత డబ్బు ఖర్చు చేస్తే నీకెందుకు..? నీ లిమిట్స్‌లో నువ్వు ఉండి.. పని చేసుకుని పో..!’ అని వార్నింగ్ ఇచ్చినట్లు షకలక శంకర్ తాజాగా వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.