యాప్నగరం

ఎన్టీఆర్ సినిమాకు పవన్ క్లాప్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే.

TNN 22 Oct 2017, 2:00 pm
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. మిలిటరీ నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కనుందని మొదట వార్తలు వచ్చినప్పటికీ.. ఇది పక్కా కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని తాజా సమాచారం. సోమవారం (అక్టోబర్ 23) ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించి వచ్చే ఏడాది జనవరి నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ నిర్వహించనున్నారు.
Samayam Telugu pawan kalyan to clap and launch jr ntr movie
ఎన్టీఆర్ సినిమాకు పవన్ క్లాప్!


అయితే ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాబోతుండడం విశేషం. తొలి క్లాప్ కూడా ఆయనే కొట్టనున్నారు. పవన్ కల్యాణ్‌తో పాటు కల్యాణ్ రామ్, హరికృష్ణలు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ స్వరకర్తగా వ్యవహరించనున్నారు. ఇది ఎన్టీఆర్‌కు 28వ సినిమా. ఇప్పటికే వరుస విజయాలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తుండటంతో సినిమా ప్రారంభానికి ముందే అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇదిలా ఉంటే.. త్రివిక్రమ్ ప్రస్తుతం పవన్ కల్యాణ్ సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు. ఈ సినిమాకు టైటిల్‌గా ‘అజ్ఞాతవాసి’ అనే పేరును పరిశీలిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.