యాప్నగరం

PSPK25 తర్వాత పవన్ చేయబోయే సినిమా ఇదేనా ?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్‌తో తాను చేస్తోన్న 25వ సినిమా తర్వాత మరో సినిమా చేస్తారా లేక రాజకీయాల్లో బిజీ అవుతారా ...

Samayam Telugu 15 Oct 2017, 10:48 pm
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్‌తో తాను చేస్తోన్న 25వ సినిమా తర్వాత మరో సినిమా చేస్తారా లేక రాజకీయాల్లో బిజీ అవుతారా అనే టాక్ సోషల్ మీడియాలో ఎప్పటినుంచో వినిపిస్తోంది. 2019 ఎన్నికలకు సిద్ధం అవడం కోసం పవన్ త్వరలోనే పూర్తి స్థాయి రాజకీయాలతో బిజీ అవుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే, తాజాగా ఈ ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెడుతూ పవన్ చేయాల్సి వున్న సినిమాల జాబితాలో మరో కొత్త సినిమా కూడా వచ్చిచేరినట్టు తెలుస్తోంది.
Samayam Telugu pawan kalyan to start an other film after pspk 25
PSPK25 తర్వాత పవన్ చేయబోయే సినిమా ఇదేనా ?


త్రివిక్రమ్ తో సినిమా పూర్తయిన తర్వాత వెంటనే కందిరీగ పేమ్ సంతోష్ శ్రీనివాస్ తో పవన్ ఓ సినిమా చేయనున్నాడనే టాక్ ఇవాళ కొత్తది కాదు. కాకపోతే చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఈ సినిమా గురించి ఫిలింనగర్ లో చర్చలు జరుగుతున్నాయి. డిసెంబర్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం వుందని ఫిలింనగర్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇప్పటికే సంతోష్ శ్రీనివాస్ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పైనే బిజీగా వున్నాడనేది ఆ టాక్ సారాంశం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడంలో ఎంత నిజం వుందో అతి త్వరలోనే అధికారికంగా తేలిపోనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.