యాప్నగరం

పవర్ స్టార్ టార్గెట్ @12

ఒక వైపు రాజకీయాలు.. మరో వైపు సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు పవర్ స్టార్.. ఇటీవల విడుదలైన కాటమరాయుడు మూవీ ఒక్క రోజు సందడిగా మిగిలిపోవడంతో తన ఫోకస్‌ను నెక్స్ట్ మూవీకి షిప్ట్‌చేశారు పవర్ స్టార్.

TNN 11 Apr 2017, 5:35 pm
ఒక వైపు రాజకీయాలు.. మరో వైపు సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు పవర్ స్టార్. ఇటీవల విడుదలైన కాటమరాయుడు మూవీ ఒక్క రోజు సందడిగా మిగిలిపోవడంతో తన ఫోకస్‌ను నెక్స్ట్ మూవీకి షిప్ట్‌చేశారు పవర్ స్టార్. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కొన్ని యాక్షన్ సన్నివేశాలను హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. అయితే సినిమా షూటింగ్ కోసం పవన్ రోజుకి 12 గంటల పాటు కష్టపడుతున్నాడని సమాచారం.
Samayam Telugu pawan kalyan working 12 hours for trivikram movie
పవర్ స్టార్ టార్గెట్ @12


ఈ ఒక్క షెడ్యూల్‌కు మాత్రమే కాకుండా మొత్తం సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు కూడా ఇలానే రోజులో 12 గంటలు కష్టపడాలని నిర్ణయించుకున్నారట. ఎట్టి పరిస్థితుల్లో మూడు నెలల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. జులై నాటికి సినిమా షూటింగ్ పూర్తి చేసి ఆగస్ట్11న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఫ్యాన్ మేడ్ పోస్టర్:

కాబట్టి ఉన్న సమయంలో సినిమాలో పూర్తి చేయడం కష్టమే.. అందుకే పవన్‌తో ఇలా లాంగ్ కాల్షీట్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. పవన్ కూడా త్రివిక్రమ్ అడిగిన వెంటనే రోజులో 12 గంటలు పని చేస్తానని చెప్పేశారట. దీనికోసమే పవన్ రెగ్యులర్‌గా తీసుకునే పారితోషికం కంటే కాస్త ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు సమాచారం. దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో పవన్‌కు జంటగా కీర్తి సురేష్, అను ఎమ్మాన్యూయల్‌లు కనిపించబోతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.