యాప్నగరం

సైరా సినిమాలో పవన్ కల్యాణ్ కీ రోల్ ?

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్న సైరా ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓ అతిథి పాత్ర...

TNN 25 Nov 2017, 12:32 pm
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్న సైరా ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓ అతిథి పాత్ర చేయనున్నాడనే టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించి సైరా మూవీ యూనిట్ సభ్యుల నుంచి ఎటువంటి స్పష్టమైన ప్రకటన లేనప్పటికీ తాజాగా సోషల్ మీడియాలో మాత్రం సైరాలో పవన్ అతిథి పాత్రపై జోరుగా చర్చ జరుగుతోంది. సైరా సినిమాలో 10 నిమిషాల నిడివి కలిగిన ఓ ముఖ్యమైన పాత్ర కోసం సైరా మేకర్స్ పవన్ కల్యాణ్‌ని సంప్రదించారనేది సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం సారాంశం.
Samayam Telugu pawan kalyans cameo in chiranjeevis sye raa
సైరా సినిమాలో పవన్ కల్యాణ్ కీ రోల్ ?


ఒకవేళ పవన్ కానీ సైరా మేకర్స్ ప్రపోజల్‌కి ఓకే చెప్పాడంటే... సైరా సినిమా మరింత కన్నుల పండువగా వుంటుందనేది మెగా అభిమానుల ఆకాంక్ష. ఆ అన్నాదమ్ముళ్లిద్దరినీ ఒకే స్క్రీన్‌పై చూస్తే ఆ ఆనందమే వేరు. అన్నింటికిమించి మెగా ఫ్యామిలీలో ఏ విభేదాలు లేవని చెప్పడానికి అంతకన్నా మంచి దృశ్యం ఇంకొకటి ఉండదు అనే టాక్ కూడా వినిపిస్తోంది.

చిరంజీవి-పవన్ కల్యాణ్‌ల మధ్య వున్న అనుబంధం ఇటీవల కాలంలో పలు సందర్భాల్లో న్యూస్ హెడ్‌లైన్స్‌లోకి ఎక్కింది. అన్నయ్య చిరంజీవి మళ్లీ సినిమాల్లోకి రావడాన్ని స్వాగతించిన పవన్ కల్యాణ్.. చిరు ఖైదీ నెంబర్ 150 సినిమా చేస్తున్న సమయంలోనే ఆయన్ని కలిసి అభినందనలు తెలిపారు. వీళ్లిద్దరూ కలిసి నటించిన చివరి సినిమా శంకర్ దాదా జిందాబాద్. 2007లో రిలీజైన ఈ సినిమాలో పవన్ ఓ అతిథి పాత్ర చేశారు. అలాగే ఇప్పడు కూడా అన్నయ్య చిరుపై వున్న అభిమానంతో పవన్ సైరా సినిమాకు ఓకే చెప్పే అవకాశాలు లేకపోలేదని ఆశిస్తున్నారు మెగా ఫ్యాన్స్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.