యాప్నగరం

Pawan Kalyan: ఓరి సాంబో రాస్కోరా.. ఈ తిక్కకి ఎనిమిదేళ్లు.. నేటికీ అదే ఊపు

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్-దర్శకుడు హరీష్ శంకర్ కాంబోలో 2012 వచ్చిన ‘గబ్బర్ సింగ్’ చిత్రం విడుదలై రేపటికి (మే 11) ఎనిమిదేళ్లు పూర్తి కావడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ట్విట్టర్‌లో హంగామా మొదలుపెట్టారు.

Samayam Telugu 10 May 2020, 11:08 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో బాక్సాఫీస్‌కి రుచి చూపిన చిత్రం ‘గబ్బర్ సింగ్’. అన్ని సినిమాలు ఓ లెక్క.. ఈ సినిమా లెక్క అన్నట్టుగా తన తిక్కతో బాక్సాఫీస్ లెక్కలు మార్చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న పవన్ కళ్యాణ్‌ని ‘గబ్బర్ సింగ్’‌గా చూపించి పవన్ కళ్యాణ్ మేజరిజంకు సరికొత్త రూపం తీసుకుని వచ్చారు దర్శకుడు హరీష్ శంకర్.
Samayam Telugu గబ్బర్ సింగ్ (Gabbar Singh)
Gabbar Singh


ఓరి సాంబో రాస్కోరా... నాక్కొంచి తిక్క ఉంది.. దానికో లెక్క ఉంది అంటూ పదేళ్లకు సరిపడా బాక్సాఫీస్ లెక్కల్ని సెట్ చేసిన ‘గబ్బర్ సింగ్’ వచ్చి మే 11 నాటికి 8 ఏళ్లు. 2012 మే 11 గబ్బర్ సింగ్ విడుదల కావడంతో ట్విట్టర్‌లో గబ్బర్ సింగ్ 8 ఇయర్స్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. బండ్ల గణేష్ నిర్మించిన ఈ చిత్రం అతన్ని నిర్మాతగా మరో మెట్టు ఎక్కిస్తే.. పవన్ కళ్యాణ్ అభిమానుల గుండెల్లో ‘గబ్బర్ సింగ్‌’గా నిలబెట్టడంతో ఈ సినిమా విడుదల రోజు కావడంతో సోమవారం నాడు ‘గబ్బర్ సింగ్ 8 ఇయర్స్ హ్యాష్ ట్యాగ్’తో ఇంటర్నెట్‌ను షేక్ చేసేందుకు పవన్ ఫ్యాన్స్ ఇప్పటికే హంగామా మొదలుపెట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.