యాప్నగరం

ఆల్ టైం రికార్డ్: కోటి కొట్టిన కాటమరాయుడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్నిసార్లు రావడం లేటవ్వొచ్చేమో కాని రికార్డ్స్ మాత్రం పక్కా అని మరోసారి నిరూపించాడు. కాటమరాయుడు టీజర్‌తో టాలీవుడ్ చరిత్రలోనే కొత్త పేజీతో రికార్డ్ నెలకొల్పాడు.

TNN 14 Mar 2017, 3:48 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్నిసార్లు రావడం లేటవ్వొచ్చేమో కాని రికార్డ్స్ మాత్రం పక్కా అని మరోసారి నిరూపించాడు. కాటమరాయుడు టీజర్‌తో టాలీవుడ్ చరిత్రలోనే కొత్త పేజీతో రికార్డ్ నెలకొల్పాడు. నెల రోజుల క్రితం రిలీజ్ అయిన కాటమరాయుడు టీజర్ కోటి వ్యూస్‌ క్రాస్ చేసి ఇప్పటివరకూ ఏ తెలుగు సినిమా సాధించలేని సరికొత్త రికార్డ్ తనకు మాత్రమే సాధ్యం అని చేసి చూపించాడు పవర్ స్టార్.
Samayam Telugu pawan kalyans katamarayudu teaser creates new record in tollywood
ఆల్ టైం రికార్డ్: కోటి కొట్టిన కాటమరాయుడు


తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ కబాలి సౌత్ ఇండియాలోనే తొలి ప్లేస్‌లో ఉండగా తాజాగా పవర్ స్టార్ అప్ కమింగ్ మూవీ కాటమరాయడు కోటి వ్యూస్‌ దాటి టాలీవుడ్‌లో తొలి స్థానాన్ని ఆక్రమించింది. ఆదివారం (మార్చి 12) వరకు ఈ టీజర్‌కు కోటికి పైగా వ్యూస్ రాగా.. రెండున్నర లక్షలకు పైగా లైక్స్‌తో మరో రికార్డ్ సాధించింది. రాజమౌళి బాహుబలి టీజర్, బాహుబలి2 మోషన్ మోస్టర్స్ కోటి వ్యూస్‌ను సాధించలేదు. అయితే అన్ని భాషలను కలుపుకుంటే.. బాహుబలి2 మోషన్ పోస్టర్‌దే తొలిస్థానం.

ఇదిలాఉంటే బన్నీ దువ్వాడ జగన్నాథం టీజర్ ఇప్పటికే 90 లక్షలు దాటడంతో కాటమరాయుడు టీజర్ రికార్డ్స్‌ను డీజే దువ్వాడ జగన్నాథం త్వరలోనే బ్రేక్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి.

కిషోర్ పార్థసాని( డాలీ) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పవన్‌కు జోడీగా శ్రుతి హాసన్ నటిస్తోంది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకొంటున్న కాటమరాయుడు సినిమా పోస్టు ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నెల 24న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోన్న కాటమరాయుడు మరిన్ని రికార్డ్స్ క్రియేట్ చేయటం పక్కా అని పవన్ ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.