యాప్నగరం

'కాటమరాయుడు' టైటిల్ సాంగ్ నిజంగానే స్పెషల్

కాటమరాయుడు టైటిల్ సాంగ్‌కి కూడా కొన్ని ప్రత్యేకతలు వున్నాయి అంటున్నారు ఆ సినిమాకి...

TNN 17 Mar 2017, 3:13 pm
ఏ సినిమాకైనా టైటిల్ సాంగ్ ఆయువు పట్టులాంటిది అని అందిరికీ తెలిసిందే. ఆ సినిమాలోని కథాంశం, హీరో క్యారెక్టర్ ఏంటో తెలిపేలా టైటిల్ సాంగ్స్‌కి లిరిక్స్ రాసుకోవడం, చిత్రీకరించడం చేస్తుంటారు. అలాగే కాటమరాయుడు టైటిల్ సాంగ్‌కి కూడా కొన్ని ప్రత్యేకతలు వున్నాయి అంటున్నారు ఆ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించిన ప్రసాద్ మూరెళ్ల.
Samayam Telugu pawan kalyans katamarayudu title song shot in midst of nature and trees
'కాటమరాయుడు' టైటిల్ సాంగ్ నిజంగానే స్పెషల్


సాధారణంగానే ప్రకృతిని ప్రేమించే పవన్ కల్యాణ్ కాటమరాయుడు సినిమాలో రైతు బాంధవుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా టైటిల్ సాంగ్ అంతా పచ్చని చెట్లు, ప్రకృతి మధ్య చిత్రీకరించేలా ప్లాన్ చేయమన్నారట పవన్. ఆయన చెప్పినట్టుగానే హైదరాబాద్ శివార్లలోని అనాజ్‌పూర్‌లో ఆరు రోజులపాటు పచ్చని చెట్లు, పొలాలు వంటి ప్రకృతి మధ్య షూటింగ్ జరిపినట్టు తెలిపారు ప్రసాద్ మూరెళ్ల.

అంతేకాకుండా పవన్ ఇమేజ్‌కి తగినట్టుగా దేశ వ్యాప్తంగా వున్న భిన్న సంస్కృతులని ఈ పాటలో ప్రతిబింభించేలా 300 మంది డ్యాన్సర్లని ఈ సాంగ్ కోసం తీసుకున్నారు. ఇందులో 100 మంది సిక్కు యోధులు, 100 మంది పహెల్వాన్లతోపాటు కూలీలు, వృద్ధులు, స్కూల్ పిల్లలని ఈ సాంగ్‌లో కనిపించేలా మేకర్స్ జాగ్రత్త పడ్డారు. అందుకే ఈ సాంగ్ చూడటానికి కన్నుల పండువగా వుంటుందంటున్నారు ప్రసాద్ మూరెళ్ల.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.