యాప్నగరం

పవన్ పాదయాత్రకు అడ్డొస్తున్న భద్రతా కారణాలు ?

పవన్ కల్యాణ్ ప్రస్తుతం చేస్తోన్న సినిమా షూటింగ్ పూర్తికాగానే ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర చేపట్టి ప్రజా సమస్యలపై...

TNN 6 Nov 2017, 3:34 pm
పవన్ కల్యాణ్ ప్రస్తుతం చేస్తోన్న సినిమా షూటింగ్ పూర్తికాగానే ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర చేపట్టి ప్రజా సమస్యలపై సమరభేరి మోగించాలని అనుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ పాద యాత్ర ద్వారా ప్రజా సమస్యలపై అవగాహన పెంచుకుని రాజకీయాల్లో క్రియాశీలకం కావాలని పవన్ ఇప్పటివరకు ప్లాన్ చేసుకున్నారు. కానీ లేటెస్ట్ అప్‌డేట్స్ ప్రకారం పవన్ పాదయాత్ర ప్లాన్స్‌లో మార్పులు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.
Samayam Telugu pawan kalyans padayatra plans changed due to security issues
పవన్ పాదయాత్రకు అడ్డొస్తున్న భద్రతా కారణాలు ?


ఇటీవల కాలంలో తమతో తరచుగా భేటీ అవుతున్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌తో ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు పాదయాత్రకు సంబంధించిన భద్రతా అంశాలపై పలు అభ్యంతరాలు లేవనెత్తారట. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన పవన్ కల్యాణ్ పాదయాత్ర చేస్తే భద్రత రీత్యా పలు సమస్యలు ఎదురయ్యే ప్రమాదం వుందని సూచించారట. అంతేకాకుండా పవన్ లాంటి వాళ్లు పాద యాత్ర చేస్తే, అతడిని చుట్టుముట్టే అభిమానులతో ఆ పాదయాత్ర ముందుకు సాగదని స్పష్టంచేశారట. పాదయాత్ర స్థానంలో బస్సు యాత్ర లాంటిది ప్లాన్ చేస్తే పర్వాలేదని అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు ఇచ్చిన సలహా పవన్‌ని సైతం ఆలోచింపచేసినట్టు సమాచారం.

ఈ నేపథ్యంలో పవన్ తన పాదయాత్ర రద్దు చేసుకుని బస్సు యాత్ర చేపట్టే అవకాశాలున్నాయనే టాక్ వినిపిస్తోంది. దీనిపై జనసేన పార్టీ అధికారికంగా ఏమని స్పందిస్తుందో చూడాలి మరి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.