యాప్నగరం

విడుదలకు ముందే వకీల్ సాబ్ హంగామా.. పవర్ స్టార్ సినిమాకు మరో భారీ ఆఫర్!

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘వకీల్ సాబ్’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర శాటిలైట్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు టాక్.

Samayam Telugu 15 Jan 2021, 10:22 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ అంటూ సినిమాల్లోకి గ్రాండ్ రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ హైప్ క్రియేట్ అయింది. పవన్‌ని తిరిగి వెండితెరపై చూడబోతున్నామనే శుభవార్త మెగా అభిమానుల్లో జోష్ నింపింది. ఈ పరిస్థితుల నడుమ ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసిన చిత్రయూనిట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. అయితే ఇప్పటికే ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రారంభమైందని తెలుస్తుండగా శాటిలైట్, డిజిటల్ రైట్స్ కోసం పోటీ ఎక్కువైందనేది ఫిలిం నగర్ నుంచి అందుతున్న సమాచారం.
Samayam Telugu విడుదలకు ముందే వకీల్ సాబ్ హంగామా.. పవర్ స్టార్ సినిమాకు మరో భారీ ఆఫర్!
Vakeel Saab


మొదట వకీల్ సాబ్ సినిమా శాటిలైట్ హక్కుల కోసం 15 కోట్లకు పైగానే ఆఫర్ చేసిన ఓ ప్రముఖ ఛానల్ అనూహ్యంగా తప్పుకోవడంతో.. ఆ స్థానంలో జీ తెలుగు ఎంటరైందని, 15 కోట్లకు పైగానే ఖర్చు చేసి ఈ మూవీ రైట్స్ సొంతం చేసుకుందని టాక్ నడుస్తోంది. ఇక ఈ సినిమాపై జనాల్లో ఉన్న ఆతృతను పెంచేస్తూ సంక్రాంతి కానుకగా నిన్న (జనవరి 14) వకీల్ సాబ్ టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్‌లో చూపించిన హీరో ఎలివేషన్స్ సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాయి.
మొదటి రోజే బాక్సాఫీస్‌ని దున్నేసిన రామ్.. రికార్డు స్థాయిలో RED కలెక్షన్స్
దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న ఈ `వకీల్‌ సాబ్` సినిమాను ఏప్రిల్ 9న గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన అంజలి, నివేత థామస్, అనన్య నాగేళ్ల హీరోయిన్లుగా నటించగా.. శృతి హాసన్ ముఖ్యపాత్ర పోషించారు. పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో కనిపించనుండటం విశేషం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.