యాప్నగరం

అనుకున్నదే అయ్యింది.. పవన్ హ్యాండ్ ఇచ్చేశాడు

పవన్ కళ్యాణ్.. ఒక వైపు సినిమాలు మరో వైపు రాజకీయాలు అంటూ రెండు పడవలపై ప్రయాణం అంత సురక్షితం కాదని సినిమాలకు గుడ్ బై చెప్తున్నట్టు ప్రకటించినప్పటికీ ... వరుస సినిమాలను లైన్‌లో పెట్టాడు

TNN 13 Jun 2017, 10:52 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయంగా ‘జనసేన’ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. ఒక వైపు సినిమాలు మరో వైపు రాజకీయాలు అంటూ రెండు పడవలపై ప్రయాణం అంత సురక్షితం కాదని సినిమాలకు గుడ్ బై చెప్తున్నట్టు ప్రకటించినప్పటికీ ... వరుస సినిమాలను లైన్‌లో పెట్టాడు.
Samayam Telugu pawan not doing movie with am rathnam
అనుకున్నదే అయ్యింది.. పవన్ హ్యాండ్ ఇచ్చేశాడు


దీంతో పవన్ ఫ్యాన్స్ కాస్త రిలాక్స్ అయినప్పటికీ తాజాగా ఆయన ఒప్పుకున్న సినిమాలు పట్టాలెక్కకముందే జెండా ఎత్తేస్తున్నాయి. తమిళ దర్శకుడు నేసన్ చాలా కాలంగా పవన్ కోసం ఎదురుచూస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమాకు కొబ్బరికాయ కూడా కొట్టేశారు కానీ సినిమా పట్టాలెక్కలేదు.

ప్రస్తుతం పవన్.. త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉండడం దానికి కారణమని చెప్పొచ్చు. త్రివిక్రమ్ సినిమా పూర్తయిన వెంటనే నేసన్ సినిమా మొదలవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు పవన్ తనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న నేసన్‌కు హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. చాలా కాలంగా ఈ సినిమా ఆగిపోయిందంటూ వార్తలు వచ్చాయి కానీ ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు.

తాజాగా సమాచారం ప్రకారం పవన్ ఈ సినిమా కోసం తీసుకున్న అడ్వాన్స్‌ను తిరిగి ఇచ్చేసినట్లు తెలుస్తోంది. అయితే పవన్ ఈ ప్రాజెక్ట్ నుండి ఎందుకు తప్పుకున్నాడనే విషయంలో క్లారిటీ లేదు. అయితే పవన్ తన రాజకీయ పార్టీను బలోపేతం చేయడానికి గ్యాప్ తీసుకుంటాడంటూ వార్తలు వస్తున్నాయి.

మరోపక్క మైత్రి మూవీ మేకర్స్‌తో సినిమా చేయడానికే నేసన్ సినిమా నుండి తప్పుకున్నట్లు చెబుతున్నారు. కారణం ఏదైనా... పవన్, నేసన్‌ల సినిమా అయితే ఆగిపోయింది. త్రివిక్రమ్ సినిమా పూర్తయిన తరువాత పవన్ తన పూర్తి దృష్టి రాజకీయాల మీదే పెట్టనున్నాడు. కాబట్టి మరో సినిమా చేసే సమయం దొరకకపోవచ్చు. కొన్నాళ్ళ పాటు సినిమాలకు దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయంటూ పవన్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.