యాప్నగరం

పవన్ బుల్లెట్ యమా క్రేజ్ గురూ..!

పవన్ కల్యాణ్ తన సినిమాలో ఎలాంటి వస్తువులు ఉపయోగించినా... వాటికి తెగ క్రేజ్ వచ్చేస్తోంది. వాటిని సొంతం చేసుకోవాలని అభిమానులు ముచ్చట పడుతూ ఉంటారు.

TNN 24 Oct 2016, 5:13 pm
పవన్ కల్యాణ్ తన సినిమాలో ఎలాంటి వస్తువులు ఉపయోగించినా... వాటికి తెగ క్రేజ్ వచ్చేస్తోంది. వాటిని సొంతం చేసుకోవాలని అభిమానులు ముచ్చట పడుతూ ఉంటారు. పవన్ నటించిన 'గోపాల గోపాల' సినిమాలో బైక్ నడిపే సీన్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. అలానే ఇటీవల గబ్బర్ సింగ్ సినిమాలో బైక్ ను నడిపి, గుర్రం బొమ్మపై కూర్చొని ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాడు. అలానే ఇప్పుడు ఆయన నటిస్తోన్న 'కాటమరాయుడు' చిత్రంలో కూడా పవన్ బుల్లెట్ నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆ బుల్లెట్ ఫోటోను సోషల్ మీడియాలో ఉంచడంతో అందులోనూ బైక్ నెంబర్ 1 కావడంతో పవన్ అభిమానులు తెగ ఆనందపడిపోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. శరత్ మరార్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని మార్చి నెలలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Samayam Telugu pawankalyan katam rayudu bike
పవన్ బుల్లెట్ యమా క్రేజ్ గురూ..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.