యాప్నగరం

గుండె పగిలింది.. అది మాటల్లో చెప్పలేని బాధ.. ఆందోళనలో ఉన్నానంటూ పాయల్ తీవ్ర ఆవేదన

ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎప్పుడు ఎలాంటి బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. తాజాగా యంగ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తన బాధను వెళ్లగక్కుతూ ఓ పోస్ట్ పెట్టింది.

Samayam Telugu 20 May 2021, 12:11 pm

ప్రధానాంశాలు:

  • పాయల్ రాజ్‌పుత్ ఇంట విషాదాలు
  • తీవ్ర ఆవేదన చెందుతూ హీరోయిన్ పోస్ట్
  • జీవితంలో ఇదే తొలిసారి అంటూ ఆవేదన

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu గుండె పగిలింది.. ఆందోళనలో ఉన్నానంటూ పాయల్ తీవ్ర ఆవేదన
Payal Rajput
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతోంది. మహమ్మారి వైరస్ దాటికి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. సాధారణ, సెలబ్రిటీ అనే తేడాలేకుండా అందరి జీవితాలను ఛిద్రం చేస్తోంది కరోనా వైరస్. ఎన్నో కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగుల్చుతున్న కోవిడ్.. హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఇంట్లోనూ తీవ్ర విషాదాన్ని నింపింది. కరోనా కారణంగా తనకు బాగా కావాల్సిన ఇద్దరు వ్యక్తులను కోల్పోయింది పాయల్. దీంతో తీవ్ర ఆవేదన చెందుతూ తన ఇన్స్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది.
పాయల్ రాజ్‌పుత్ ప్రియుడు సౌరభ్ డింగ్రా తల్లి అనిత కరోనా కారణంగా ఇటీవలే మరణించగా.. మరో సన్నిహితమైన వ్యక్తి ఆమెకు దూరమయ్యారట. అస్సలు ఊహించని ఈ రెండు సంఘటనలతో మానసిక కుంగుబాటుకు లోనయ్యానని అంటూ ఆమె ఓ సందేశం పోస్ట్ చేసింది. దేశవ్యాప్తంగా పరిస్థితులు దారుణంగా మారాయని.. అందరూ ఇంటికే పరిమితమై తమ ప్రియమైన వారిని సంరక్షించుకోవాలని ఈ పోస్ట్ ద్వారా ఆమె తెలిపింది.
అనసూయ మళ్ళీ గర్భం దాల్చిందా? స్వయంగా ఫొటో షేర్ చేయడంతో అంతా షాక్! నెటిజన్ల కామెంట్స్ చూస్తే..
''నా జీవితంలో ఇంతటి క్లిష్టమైన పరిస్థితులు చూడటం ఇదే తొలిసారి. మానసికంగా కుంగిపోయి చాలా ఆందోళన చెందుతున్నా. నా బాధను బయటకు చెప్పడానికి మాటలు చాలవు. బయటకొచ్చి గట్టిగా ఏడవాలనిపిస్తోంది. ఈ కరోనా కారణంగా తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి దేవుడు ధైర్యాన్ని, మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా'' అని పాయల్ తన పోస్ట్‌‌లో పేర్కొన్నారు.
View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal)

మొదటి సినిమా Rx100తో టాలీవుడ్ ఆడియన్స్‌ని బుట్టలో వేసుకుంది పాయల్. కెమెరా ముందు అందచందాలు వడ్డించడమే గాక తనదైన అభినయంతో ఆకట్టుకున్న ఈ అమ్మడు.. ఆ తర్వాత వరుస అవకాశాలు పట్టేసింది. ఇటీవలే 'సీత' సినిమాలో ఐటెం సాంగ్ చేసి ఉర్రూతలూగించిన ఆమె ''వెంకీ మామ, డిస్కో రాజా'' సినిమాలతో అలరించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.