యాప్నగరం

నాకు అన్నీ అమ్మే నేర్చించింది.. పాయల్ రాజ్‌పుత్ కామెంట్స్ వైరల్

పాయల్ తన అమ్మకు బర్త్ డే విషెస్ చెబుతూ ప్రేమను కురిపించారు. పిల్లలకు తల్లిదండ్రులే మొట్టమొదటి గురువులు అవుతారు. ఏం నేర్పించినా కూడా మొదట వారే నేర్పించాలి. అలా తనకు అన్నీ కూడా తన అమ్మే నేర్పించారు..

Samayam Telugu 2 Aug 2021, 3:08 pm

ప్రధానాంశాలు:

  • సోషల్ మీడియాలో పాయల్ రచ్చ
  • అమ్మ పుట్టిన రోజు అంటూ స్పెషల్ పోస్ట్
  • స్పందించిన పాయల్ ప్రియుడు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu నాకు అన్నీ అమ్మే నేర్చించింది.. పాయల్ రాజ్‌పుత్
Payal Rajput
పాయల్ రాజ్‌పుత్ ఫాలోయింగ్, ఆమె క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. RX100 అంటూ టాలీవుడ్‌ను షేక్ చేసేశారు. తెలుగు యూత్ ప్రేక్షకులను పాయల్ కట్టిపడేశారు. ఇందు పాత్రలో పాయల్ నటించిన తీరుకు అందరూ ఫిదా అయ్యారు. అయితే మళ్లీ ఇంత వరకు ఆ రేంజ్ సక్సెస్‌ను చూడలేకపోయారు. అలా పాయల్ నటించిన చిత్రాల్లో కొన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేశాయి. ఇంకొన్ని హిట్ అయినా కూడా క్రెడిట్ మాత్రం దక్కలేదు. అలా పాయల్ కెరీర్ ఓ అడుగు ముందుకు ఓ అడుగు వెనక్కి అన్నట్టు సాగుతోంది.
సినీ కెరీర్ కాస్త పక్కన పెడితే సోషల్ మీడియాలో మాత్రం పాయల్ రచ్చ వేరే లెవెల్‌లో ఉంటుంది. ఆమె తన ప్రియుడు సౌరభ్ కలిసి చేసే అల్లరి ఎప్పుడూ కూడా హాట్ టాపిక్ అవుతుంటుంది. ఇప్పుడు సౌరభ్ టాలీవుడ్ ఎంట్రీ కోసం కూడా మంచి ప్రణాళికలే వేశారు. మొత్తానికి పాయల్, తన ప్రియుడు కలిసి తెలుగు తెరపై సందడి చేసేందుకు అంతా రెడీ అవుతోంది.
ఏవేవో రాస్తున్నారు.. చట్టాన్ని పని చేయనివ్వండి.. మీడియాపై శిల్పా శెట్టి కామెంట్స్
తాజాగా పాయల్ తన అమ్మకు బర్త్ డే విషెస్ చెబుతూ ప్రేమను కురిపించారు. పిల్లలకు తల్లిదండ్రులే మొట్టమొదటి గురువులు అవుతారు. ఏం నేర్పించినా కూడా మొదట వారే నేర్పించాలి. అలా తనకు అన్నీ కూడా తన అమ్మే నేర్పించారు.. అమ్మే నా ప్రపంచం.. నువ్వంటే నాకు ఎంతో ఇష్టం మమ్మీ.. నువ్ ఎప్పుడూ ఇలానే ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకున్నారు. ఇక పాయల్ ప్రియుడు సైతం విషెస్ అందించారు. హ్యాపీ బర్త్ డే ఆంటీ.. మీరు ఇలానే ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని కోరుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.