యాప్నగరం

​రజనీ ‘కాలా’ కాపీ కథనే...?

ఫస్ట్ లుక్ తోనే రజనీకాంత్ అభిమానులను అమితంగా అలరించేసిన సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కాలా’పై అప్పుడే వివాదాలు ముసురుకొంటున్నాయి.

TNN 1 Jun 2017, 9:26 am
ఫస్ట్ లుక్ తోనే రజనీకాంత్ అభిమానులను అమితంగా అలరించేసిన సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కాలా’పై అప్పుడే వివాదాలు ముసురుకొంటున్నాయి. ఈ సినిమా పై కాపీ ఆరోపణలు వస్తున్నాయి. ఏకంగా చెన్నై కమిషనరేట్ ఈ మేరకు ఒక ఫిర్యాదు కూడా దాఖలు కావడం ఆసక్తికరంగా మారిందిప్పుడు. రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న ‘కాలా- కరికాలన్’ సినిమా కాన్సెప్ట్ తన దే అని దాన్ని కాపీ కొట్టే ఈ సినిమాను రూపొందిస్తున్నారు ఒక తమిళ అసిస్టెంట్ డైరెక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Samayam Telugu plagiarism dispute on kaala movie
​రజనీ ‘కాలా’ కాపీ కథనే...?


ఇంతకీ అతడి వాదన ఏమిటంటే.. అతడి పేరు కె.రాజశేఖరన్. తమిళ చిత్ర సీమలో చాన్నాళ్లుగా పని చేస్తున్నాడు. హీరో ధనుష్ తండ్రి కస్తూరి రాజా వద్ద అసిస్టెంట్ గా పని చేశాడు. ఈ క్రమంలోనే ‘కరికాలన్’ పేరుతో ఒక కథను రాసుకున్నాడట. దాని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాడట. అంతేనా.. ఈ కథను 1996లోనే సూపర్ స్టార్ రజనీకాంత్ కు వివరించానని ఈ సినిమా వ్యక్తి అంటున్నాడు. అయితే అప్పట్లో ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదని, ఒక దశలో విక్రమ్ హీరోగా తమ సినిమాను ఆరంభించామని చెబుతున్నాడు.

2001లో విక్రమ్ హీరోగా కరికాలన్ ఆరంభం అయ్యిందని, అయితే సినిమాను పూర్తి చేయలేకపోయానని చెబుతున్నాడు. మరి ఇప్పుడు అదే కాన్సెప్ట్ తో ధనుష్ నిర్మాణంలో రజనీకాంత్ హీరోగా రంజిత్ దర్శకత్వంలో ‘కాలా’ రూపొందుతోందని తెలిసి తను నిర్ఘాంతపోయానని.. దీనిపై విచారణ చేపట్టి తనకు న్యాయం చేయమని కోరుతూ రాజశేఖరన్ కమిషనరేట్ లో ఫిర్యాదు చేశాడు.

మరి సూపర్ స్టార్ సినిమాలకు ఇలాంటి వివాదాలు కొత్తేమీ కాదు. ‘రోబో’ వంటి సినిమాకు కూడా కాపీరైట్ వివాదాలు రేకెత్తాయి. కాలా కు కూడా వాటి ముప్పు తప్పుతున్నట్టుగా లేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.