యాప్నగరం

ద్యావుడా... చిత్ర దర్శకుడు అరెస్టు

వివాదాస్పద చిత్రంగా మారిన ‘ద్యావుడా...’ సినిమా దర్శకుడు, ప్రొడ్యూసర్‌లపై కేసు నమోదు అయింది.

TNN 19 Jan 2017, 2:44 pm
వివాదాస్పద చిత్రంగా మారిన ‘ద్యావుడా...’ సినిమా దర్శకుడు, ప్రొడ్యూసర్‌లపై కేసు నమోదు అయింది. దర్శకుడు సాయిరాంను పోలీసులు అరెస్టు చేశారు. ప్రొడ్యూసర్ హరి కుమార్ రెడ్డి మాత్రం అజ్ఞాతంలోకి వెళ్లాడు. సాయిరామ్ కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించింది. ద్వావుడా సినిమా టీజర్ ను జనవరి 1న విడుదల చేసి యూట్యూబ్ లో పెట్టారు. అందులో శివలింగంపై అభ్యంతరకర సన్నివేశాలు తీసినట్టు అభియోగాలు ఉన్నాయి. తెనాలికి చెందిన సాయిరామ్ దర్శకుడిగా, కడపకు చెందిన హరి కుమార్ రెడ్డి నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
Samayam Telugu police arrested dyavuda movie director sairam
ద్యావుడా... చిత్ర దర్శకుడు అరెస్టు


ద్వావుడా టీజర్ లో శివలింగంపై చిత్రీకరించిన అభ్యంతరకర సన్నివేశాల గురించి కొన్ని వర్గాలు తీవ్రంగా విమర్శించాయి. భజరంగ్ దళ్ కు చెందిన వ్యక్తులు పోలీసులు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు సాయిరామ్ అరెస్టు చేశారు. కొన్ని దేవాలయాల్లో సిగరెట్టు, మద్యంతో కూడా శివుణ్ని ఆరాధించే సంప్రదాయాలు ఉన్నాయని, వాటినే స్పూర్తిగా తీసుకుని ద్వావుడా సినిమాలో చిత్రికరించానని సాయిరామ్ పోలీసులకు ​​ చెప్పాడు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.